ఒడిశాలోని రాయగఢ్- కోరాపుట్ రైల్వే మార్గంలో సమలేశ్వరి ఎక్స్ప్రెస్ ప్రమాదవశాత్తు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, నలుగురికి గాయాలయినట్లు అధికారులు తెలిపారు.
హావ్డా నుంచి జగదల్పూర్ వెళ్తుండగా.. పట్టాలపై నిలిపి ఉంచిన ఓహెచ్ఈ కారును రైలు ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజన్ సహా రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఆ సమయంలోనే ఇంజన్లో మంటలూ చెలరేగాయని అధికారులు తెలిపారు.
సహాయక చర్యలకుగాను 12 మంది వైద్యులు, రైల్వే అధికారులతో విశాఖ నుంచి రిలీఫ్ వ్యాన్ బయలుదేరింది. ప్రస్తుతం సింగ్పూర్రోడ్, కెబిటిగూడ స్టేషన్ మాస్టర్లను ఉన్నతాధికారుల సస్పెండ్ చేశారు.
ఇదీ చూడండి: పంట బీమా కచ్చితమా.. ఐచ్ఛికమా..?