భారత్‌ను కరోనా వైరస్ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 147మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో 25మంది విదేశీయులని స్పష్టం చేసింది.
మహారాష్ట్రలో అత్యధికంగా 42 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో ముగ్గురు మరణించారు.
మహారాష్ట్ర తర్వాత కేరళలోనే ఎక్కువ మందికి వైరస్ సోకింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 30మందికి కరోనా నిర్ధరణ అయ్యింది.
కరోనా వైరస్‌పై పోరుకు భారత్ ముమ్మర చర్యలు చేపట్టింది. వైరస్‌ను ఇప్పటికే జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్రం... అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.
ఇదీ చూడండి- కరోనా: మాస్క్ ఎవరు పెట్టుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?