ETV Bharat / bharat

వరుణుడి ఉగ్రరూపం- పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ - భారీ వర్షాలు వార్తలు

దేశవ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వివిధ రాష్ట్రాల్లోని 15 ప్రాంతాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కొంటున్నాయని కేంద్ర జల కమిషన్ తెలిపింది. మరికొన్ని రోజుల పాటు చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

rains
వరద ముప్పు
author img

By

Published : Aug 18, 2020, 5:07 AM IST

Updated : Aug 18, 2020, 10:18 AM IST

విస్తారంగా కురుస్తోన్న వర్షాలతో చాలా రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. దేశంలోని 15 ప్రాంతాల్లో వరద ఉద్ధృతి తీవ్రంగా ఉందని కేంద్ర జల కమిషన్ (సీడబ్ల్యూసీ) తెలిపింది. చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి పలువురు మరణించినట్లు వెల్లడించింది.

rains
నీట మునిగిన వంతెన
rains
మహారాష్ట్ర అదోల్ ప్రాజెక్టులో నీటి ఉద్ధృతి

దేశంలోని వాయవ్య, పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గుజరాత్​, మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్​, ఝార్ఖండ్, ఒడిశా, బంగాల్​లో మరో 5 రోజుల పాటు భారీ వానలు పడుతాయని తెలిపింది.

rains
గడ్చిరోలిలో పెరల్​కోట నది
rains
జనావాసాలు జలమయం
rains
తపతి నది

నదుల ఉగ్రరూపం..

గంగా, సట్లెజ్​, రావి, బియాస్​, యమున నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్​, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాల్లో సీడబ్ల్యూసీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని హెచ్చరించింది. దక్షిణాన గోదావరి, కృష్ణా నదులు కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.

rains
పంచగంగ నది
rains
నీట మునిగిన ఆలయం

వివిధ రాష్ట్రాల్లో..

బిహార్​లో వరద ప్రభావిత ప్రాంతాల్లో 16 జిల్లాల్లోని 81 లక్షల మంది చిక్కుకున్నారు. ఇప్పటివరకు 25 మంది మరణించారు. ఉత్తర్​ప్రదేశ్​లో 15 జిల్లాలు జలమయయ్యాయి. ఒడిశాలోనూ చాలా ప్రాంతాలు నీటమునిగాయి. గుజరాత్​లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు ఏడుగురు మరణించారు.

rains
వంతెన పైనుంచి ప్రవహిస్తున్న నీరు
rains
మాణిక్​పంజ్ ఆనకట్ట
rains
సూర్య ప్రాజెక్టులో నీటి ఉద్ధృతి

భారీ వర్ష సూచన నేపథ్యంలో మహారాష్ట్రలోని కొల్హాపుర్​, సతారాతోపాటు తీర ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. దేశ రాజధాని దిల్లీలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

ఇదీ చూడండి: వరుణుడి బీభత్సం- జల దిగ్బంధంలో రాష్ట్రాలు

Last Updated : Aug 18, 2020, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.