ETV Bharat / bharat

అలా అయితే పాకిస్థాన్‌ వెళ్లిపోండి: పోలీస్ ఉన్నతాధికారి - meerut sp pakisthan warning video

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తోన్న ఆందోళనకారులను హెచ్చరిస్తూ ‘పాకిస్థాన్‌ వెళ్లిపోండి’ అని మేరఠ్​ ఎస్పీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తర్వాత ఆ ఎస్పీ వివరణ ఇచ్చుకున్నారు. అక్కడున్న కొందరు యువకులు పాకిస్థాన్‌ను అనుకూలంగా నినాదాలు చేశారని, అందుకే తాను అలా హెచ్చరించానని చెప్పుకొచ్చారు.

meerut police
‘అలా అయితే పాకిస్థాన్‌ వెళ్లిపోండి: పోలీస్ ఉన్నతాధికారి
author img

By

Published : Dec 28, 2019, 4:52 PM IST

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర్​ప్రదేశ్‌ మేరఠ్​లో డిసెంబరు 20న పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ జరిగి ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అల్లర్ల సమయంలో మేరఠ్​ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (సిటీ) అఖిలేశ్‌ నారాయణ్‌ సింగ్‌ నిరసనకారులను హెచ్చరిస్తున్న ఓ వీడియో తాజాగా వైరల్‌ అయ్యింది. అందులో అఖిలేశ్ మాట్లాడుతూ‌.. ‘మీకు ఈ దేశంలో ఉండాలని లేకపోతే పాకిస్థాన్‌కు వెళ్లిపోండి. ఇక్కడ ఉంటూ మరో దేశాన్ని పొగుడుతారా? ఇక్కడేదైనా జరిగితే దానికి మీరే బాధ్యులు’ అని హెచ్చరించినట్లుగా ఉంది. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో సదరు వ్యాఖ్యలపై స్పందించారు ఎస్పీ అఖిలేశ్‌. '‘కొందరు యువకులు పాకిస్థాన్‌ను అనుకూలంగా నినాదాలు చేశారు. అందుకే నేను అలా మాట్లాడా. మీకు భారత్‌ అంటే ద్వేషముంటే పాకిస్థాన్‌ వెళ్లిపొమ్మని చెప్పా’' అని తెలిపారు.

మరోవైపు మేరఠ్​ ఏడీజీ ప్రశాంత్‌ కుమార్‌.. అఖిలేశ్‌ వ్యాఖ్యలను సమర్థించడం గమనార్హం.

'పరిస్థితులు సాధారణంగా ఉంటే పోలీసులు కూడా మంచిగానే మాట్లాడతారు. కానీ ఆ రోజు నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. పోలీసులపైకి రాళ్లు విసిరారు. భారత్‌కు వ్యతిరేకంగా, పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయినప్పటికీ మా అధికారులు చాలా నిగ్రహంగా వ్యవహరించారు. ఎవరిపైనా కాల్పులకు పాల్పడలేదు' అని చెప్పుకొచ్చారు.

‘అలా అయితే పాకిస్థాన్‌ వెళ్లిపోండి: పోలీస్ ఉన్నతాధికారి

ఇదీ చూడండి: భద్రతను ఛేదించి ప్రియాంకను కలిసిన వీరాభిమాని

New Delhi, Dec 28 (ANI): While speaking to ANI in the national capital on December 28, the Senior Consultant at Sir Ganga Ram Hospital Dr Atul Gogia spoke about winter health advisory for children, elders and adults. He said, "People should consume hot food items and also avoid going to outer places if it isn't required. The chances of infection get reduced if you get influenza vaccination done on time." "Morning walkers should do exercise at their residence where the environment is little bit heated. They can go out when it is slightly sunny so that they will not get in contact with problems," Gogia added.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.