ETV Bharat / bharat

వరదలకు ఉత్తర భారతం విలవిల- 137మంది మృతి

ఉత్తరాదిపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భారీ వర్షాల వల్ల యూపీ, బిహార్​ సహా ఇతర రాష్ట్రాల్లో మొత్తం 137 మంది మరణించారు. రవాణా వ్యవస్థ దెబ్బతింది.  పాఠశాలలు మూతపడ్డాయి. ఎన్​డీఆర్​ఎఫ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.​

author img

By

Published : Sep 30, 2019, 6:47 PM IST

Updated : Oct 2, 2019, 3:19 PM IST

వరదలకు ఉత్తర భారతం విలవిల- 137మంది మృతి
వరదలకు ఉత్తర భారతం విలవిల- 137మంది మృతి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బిహార్, ఉత్తర్​ప్రదేశ్ సహా ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. గత నాలుగురోజుల్లోనే.. యూపీ, బిహార్‌ సహా మిగతా రాష్ట్రాల్లో మొత్తం 137 మంది మృతి చెందారు.

బిహార్​ విలవిల...

భారీ వర్షాలతో బిహార్ వణికిపోతోంది. వర్షాల కారణంగా ఇప్పటివరకూ మరణించినవారి సంఖ్య 29కి చేరింది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. గురువారం నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పడవల్లోనే ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.

పట్నాలోని రాజేంద్ర నగర్‌లో సుమారు 5 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. నగరంలోని గాంధీ మైదానం, దాని పరిసర ప్రాంతాలు.. పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి. రోడ్లపై నిలిపిన వాహనాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. ఆసుపత్రుల్లోకి కూడా నీరు చేరడం వల్ల వైద్య సేవలు అందించడం కష్టమవుతోంది. అనేక చోట్ల సబ్‌స్టేషన్లు నీట మునిగి విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

చాలా ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను జేసీబీలు, పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పట్నా, భగల్‌పూర్, కైమూర్‌ జిల్లాలో గత 48 గంటల్లో భారీవర్షపాతం నమోదైంది. వచ్చే 24గంటల్లో భారీవర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఎన్​డీఆర్​ఎఫ్​ సహాయం..

ప్రభుత్వం మంగళవారం వరకూ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పొట్లాలు,మందుల సరఫరాకు వైమానిక దళం సాయాన్ని కోరింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతో పాటుగా 19 ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

ఉత్తర్​ప్రదేశ్ చిన్నాభిన్నం...

ఉత్తర్​ప్రదేశ్​లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వర్షాల కారణంగా... ఇప్పటివరకు 93 మంది మృతి చెందారు. వివిధ ప్రాంతాల్లో... శని,ఆదివారాల్లో మొత్తం 49 మంది మృతి చెందగా గురు, శుక్రవారాల్లో 47 మంది చనిపోయారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రహదారులు దెబ్బతిన్నాయి. వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

విపత్తు స్పందన బృందాలు రంగంలోకి దిగి ముంపునకు గురైన ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. బాలియా జిల్లా కారాగారం బ్యారక్‌లలోకి వరదనీరు ప్రవేశించడంతో 900 మంది ఖైదీలను మిగతా జైళ్లకు తరలించారు. రవాణా వ్యవస్థ దెబ్బతింది. వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. 20 రైలు సర్వీసులను రద్దు చేశారు. మరో 20 సర్వీసులను దారి మళ్లించారు.

ఇదీ చూడండి:- వరద నీటిలో యువతి కిరాక్​ ఫొటోషూట్​

AP Video Delivery Log - 1200 GMT News
Monday, 30 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1158: UK Greening Brexit No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4232439
Former tory Cabinet Minister: Boris must show Brexit plan
AP-APTN-1129: Hong Kong Activists AP Clients Only 4232435
Pro-democracy politician alleges escalating police brutality
AP-APTN-1122: France Chirac Motorcade AP Clients Only 4232434
Motorcade with Chirac's coffin makes its way to Saint-Suplice Church
AP-APTN-1109: Iran Yemen No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4232430
Iran: Attack on Saudi oil sites act of "legitimate defence"
AP-APTN-1105: Czech Republic Brexit AP Clients Only 4232429
Finland's PM: Britain's running out of time for Brexit proposal
AP-APTN-1057: Greece Lesbos Migrant Camp Security AP Clients Only 4232427
Police guard burnt containers at migrant camp
AP-APTN-1046: Taiwan Typhoon Part no access Taiwan 4232426
Domestic and some int flights cancelled due to Typhoon Mitag
AP-APTN-1010: Germany Storm NO ACCESS GERMANY 4232415
Storm prompts railway to suspend service in northern Germany
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 2, 2019, 3:19 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.