తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శుక్రవారం ఓకే వేదికపై కనిపించించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై ఇరువురి మధ్య విభేదాలు తలెత్తిన తర్వాత.. తొలిసారి వీరిద్దరు ఓకే వేదికను పంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గాంధీ జయంతి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కె. కామరాజ్ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో తలెత్తిన వివాదం కారణంగా.. అన్నాడీఎంకే సమన్వయకర్తగా ఉన్న ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. సీఎం పళనిస్వామి అధ్యక్షతన ఇటీవల జరిగిన పలు అధికారిక కార్యక్రమాలకు దూరగా ఉంటూ వస్తున్నారు.
ఇదీ చూడండి:'అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి ఆయనే!'