ప్రణాళికా సంఘాన్ని మళ్లీ తీసుకొస్తాం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రద్దు చేసిన ప్రణాళిక సంఘాన్ని పునరిద్ధరిస్తామని హామీ ఇచ్చారు మమతా బెనర్జీ. 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచడం, జీతాల పెంపు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ విధానాన్ని సమీక్షిస్తామని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడితేనే దాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ప్రజల చౌకీదార్లనే గౌరవిస్తాం
ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో మోదీ ప్రభుత్వంపై మమత తీవ్ర విమర్శలు చేశారు. నిజమైన చౌకీదారులను తాను గౌరవిస్తానని, రాజకీయ చౌకీదారులను కాదని అన్నారు. పార్టీ సీనియర్ నేతల పట్ల భాజపా ప్రవర్తన బాధాకరమని తెలిపారు. ఎల్కే అడ్వాణీతో మాట్లాడినట్టు మమత వెల్లడించారు.