ETV Bharat / bharat

'పోలీసు రాజ్యంగా మార్చారు- నేనే రంగంలోకి దిగుతా' - గవర్నర్​ జగదీప్​ ధనఖర్​

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్​పై మరోమారు విమర్శలు గుప్పించారు ఆ రాష్ట్ర గవర్నర్​ జగదీప్​ ధన్​ఖర్​. రాష్ట్రాన్ని అధికార పార్టీ పోలీసు రాష్ట్రంగా మార్చిందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించకపోతే తానే రంగంలోకి దిగాల్సి వస్తుందని, ఆర్టికల్​ 154ను పరిశీలించాల్సి వస్తుందని హెచ్చరించారు.

TMC govt turned WB into police state,
పోలీసు రాష్ట్రంగా బంగాల్​: గవర్నర్​ ధనఖర్​
author img

By

Published : Sep 28, 2020, 7:09 PM IST

బంగాల్​ గవర్నర్​ జగదీప్​ ధన్​ఖర్​, అధికార తృణమూల్​ కాంగ్రెస్​ మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా టీఎంసీపై విమర్శలు చేశారు ధన్​ఖర్​. బంగాల్​ను టీఎంసీ ప్రభుత్వం పోలీసు రాష్ట్రంగా మార్చిందన్నారు. తన కార్యాలయాన్ని చాలా కాలంగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. అది రాష్ట్రంపై గవర్నర్​కు ప్రత్యేక అధికారాలు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్​ 154ను పరిశీలించేలా చేస్తోందని హెచ్చరించారు. పోలీసులు అధికార టీఎంసీ క్యాడర్​గా పని చేస్తున్నారని తీవ్ర విమర్శ లు చేశారు.

" రాజ్యాంగాన్ని పరిరక్షించకపోతే.. నేనే రంగంలోకి దిగాల్సి వస్తుంది. గవర్నర్​ కార్యాలయం చాలా కాలంగా విస్మరణకు గురవుతోంది. అది రాజ్యాంగంలోని ఆర్టికల్​ 154 వైపు చూసేలా చేస్తోంది. బంగాల్​ పూర్తిగా పోలీసు రాష్ట్రంగా మారింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. మావోయిస్టుల తిరుగుబాటు పెరిగింది. ఉగ్ర మూకలు కూడా రాష్ట్రం నుంచి పనిచేస్తున్నాయి.

-జగదీప్​ ధన్​ఖర్​, బంగాల్​ గవర్నర్​

2019, జులైలో గవర్నర్​గా ధన్​ఖర్​ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే బంగాల్​ ముఖ్యమంత్రితో విభేదాలు తెలెత్తాయి. పలు సందర్భాల్లో పరస్పరం విమర్శలు చేసుకున్నారు. రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇటీవలే డీజీపీ వీరేంద్రకు లేఖ రాశారు ధన్​ఖర్​. డీజీపీని సెప్టెంబర్​ 26న కలవాలని ఆదేశించారు. అయితే.. డీజీపీకి లేఖరాయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మమతా బెనర్జీ. రాజ్యాంగం పరిధిలో నడుచుకోవాలని సూచిస్తూ లేఖ రాశారు.

ఇదీ చూడండి:రాజ్​భవన్​పై నిఘా: బంగాల్​ గవర్నర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.