ETV Bharat / bharat

'మద్యం తాగితే కరోనా చస్తుంది- షాపులు తెరవండి' - reopening of liquor shops news

ఆల్కహాల్ తో తయారైన శానిటైజర్లపై మందుబాబులు వేస్తోన్న జోకులకు అధికారికంగా మద్దతు లభించింది. రాజస్థాన్​కు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్యం దుకాణాలు తెరవాలని డిమాండ్ చేస్తూ.. చేతులపై ఉన్న వైరస్​ను శానిటైజర్లు చంపుతున్నప్పుడు.. గొంతులోని వైరస్​ను మద్యం ఎందుకు చంపదో చెప్పేందుకు కారణం లేదన్నారు.

coronavirus
కరోనాను శానిటైజర్లు చంపుతున్నప్పుడు.. మద్యం చంపదా?
author img

By

Published : May 1, 2020, 1:32 PM IST

Updated : May 1, 2020, 1:37 PM IST

లాక్​డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలు తెరవాలని మందుబాబులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆల్కహాల్​తో తయారైన శానిటైజర్లుపై జోకులు వేస్తున్నారు. వారికి మద్దతుగా నిలిచారు రాజస్థాన్​కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ కుందన్​పుర్. చేతులపై ఉన్న కరోనాను ఆల్కహాల్​తో తయారైన శానిటైజర్లు చంపుతున్నప్పుడు.. అదే ఆల్కహాల్ మందుబాబుల గొంతులోని వైరస్​ను అంతమొందించదని అనేందుకు ఎలాంటి కారణం లేదన్నారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాలను తెరవాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్​కు ఈమేరకు లేఖ రాశారు.

మద్యం అమ్మకాలను ప్రారంభించటం ద్వారా కల్తీ లిక్కర్ తాగి చనిపోతున్న వారిని రక్షించటమే కాక.. లాక్​డౌన్​లో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ఆదాయం సమకూరుతుందని లేఖలో పేర్కొన్నారు భరత్. కల్తీ మద్యం తాగి భరత్​పుర్​ జిల్లాలో ఇద్దరు మరణించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు కుందన్​పుర్. కరోనా వ్యాప్తికి ముందు 2019-20లో మద్యం అమ్మాకాలపై సుమారు రూ.12,500 కోట్లు ఆదాయ పొందాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుందని.. ఇప్పుడు అది అందనంత దూరంలోకి వెళ్లినట్లు గుర్తు చేశారు.

రాజస్థాన్​లో మద్యం దుకాణాలను తెరవాలని భరత్ సింగ్ ఒక్కరే డిమాండ్ చేయటం లేదు. బంద్రా ఎమ్మెల్యే, సీపీఎం నేత బల్వాన్ సింగ్ పూనియా కూడా ఇదే తరహాలో వైన్ షాపులు తెరవాలని గతంలోనే సీఎంను కోరారు.

Last Updated : May 1, 2020, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.