ETV Bharat / bharat

'భూ చట్టాల వల్ల కశ్మీర్​లో నేరాలు పెరుగుతాయి' - పీడీపీ జమ్ముకశ్మీర్​ భూ చట్టాలు

నూతన భూ చట్టాల వల్ల జమ్ముకశ్మీర్​లో నేరాలు పెరిగిపోతాయని పీడీపీ ప్రధాన కార్యదర్శి సురిందర్​ చౌదరి ఆరోపించారు. పట్టపగలే అత్యాచారాలు జరిగే రోజు వస్తుందన్నారు. ఇలాంటి చట్టాలను వ్యతిరేకించకపోతే జమ్ముకశ్మీర్​ ప్రజలను చరిత్ర క్షమించదన్నారు.

Time will come when criminal activities will increase: PDP leader on new J-K land laws
'భూ చట్టాల వల్ల కశ్మీర్​లో నేరాలు పెరుగుతాయి'
author img

By

Published : Oct 29, 2020, 9:55 AM IST

దేశంలోని ఇతర ప్రాంతాల వారు.. జమ్ముకశ్మీర్‌లో భూమి కొనుగోలుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం చేసిన చట్ట సవరణపై పీడీపీ మండిపడింది. దీని వల్ల కశ్మీర్​లో నేరాలు పెరిగిపోతాయని.. ఈ చట్టాన్ని ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది.

కశ్మీర్​లో ఎవరు భూములు కొనుక్కోరని.. కానీ ప్రభుత్వ చర్యల వల్ల స్థానికులకు భారీ నష్టం తప్పదని పీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ చట్టసభ్యుడు సురిందర్​ చౌదరి ఆరోపించారు. చట్టానికి వ్యతిరేకంగా గాంధీ నగర్​లోని పీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద చేపట్టిన నిరసనల్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు సురిందర్​.

"పట్టపగలే అత్యాచారాలు జరిగే రోజును మనం అందరం చూస్తాం. జమ్ముకశ్మీర్​లో నేరాలు పెరిగిపోతాయి. ఈ చట్టం వల్ల ఎవరైనా వచ్చి జమ్ముకశ్మీర్​లో భూములు కొనుగోలు చేయవచ్చు. జమ్ముకశ్మీర్​ను భాజపా ప్రభుత్వం అమ్మకానికి పెట్టినప్పటికీ.. ఒక్క అంగుళాన్ని కొనడానికి కూడా ఎవరూ ముందుకు రారు."

--- సురిందర్​ చౌదరి, పీడీపీ ప్రధాన కార్యదర్శి.

డోగ్రా సాంస్కృతిపై దాడి జరుగుతోందన్న సురిందర్​.. దానిని రక్షించేందుకు ప్రజలు ముందుకు రాకపోతే.. చరిత్ర క్షమించదని తేల్చిచెప్పారు.

ఇదీ చూడండి:- జమ్ముకశ్మీర్ 'ఉగ్ర​ ఎన్​జీఓ'ల్లో ఎన్​ఐఏ సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.