మధ్యప్రదేశ్లోని కన్హా జాతీయ పార్కు సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పార్కులో 'నైనా' అనే పులి కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండగా.. ఈ ఆడ పులి తన పిల్లలతో కలిసి సరదాగా గంతులేస్తోంది. ఈ దృశ్యాలను చూసిన పర్యటకులు ఫిదా అయిపోతున్నారు.
శీతకాలం కావడం వల్ల పార్కులో ప్రకృతి శోభ ఉట్టిపడుతోంది. అద్భుతమైన వాతావరణం మధ్య ప్రకృతి అందాలను చూసి మురిసిపోతున్నారు పర్యటకులు. ఈ నేపథ్యంలో.. నైనా పులి తన ముగ్గురు పిల్లలతో కలిసి పొదలు, గడ్డి, చెట్ల మధ్య ఆడుతూ కనిపిస్తోంది. పర్యటకులు ఆ పులి ఫొటోలు తీసి మురిసిపోతున్నారు. తమ ఫోన్లలో ఆ వీడియోలను చిత్రీకరిస్తున్నారు.
ఇదీ చూడండి:లైవ్ వీడియో: చెట్టు రూపంలో కమ్మేసిన మృత్యువు