నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనల్లో మరో ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను షంషేర్ సింగ్, జషన్దీప్ సింగ్, జగ్బీర్ సింగ్లుగా గుర్తించారు. ఇద్దరు పంజాబ్కి చెందిన వారు కాగా.. మరొకరు హరియాణా నివాసి.
ఛాతీ నొప్పి అని చెప్పినా..
వీరిలో ఒకరు గుండెపోటుతో మృతి చెందగా.. మరొకరు జ్వరంతో చనిపోయారు. మరో రైతు మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. షంషేర్ తనకు ఛాతీలో నొప్పిగా ఉన్నట్టు తెలిపాడని ఒక పోలీసు అధికారి తెలిపారు. అయితే అతని మరణానికి అసలు కారణాలను పోస్టుమార్టం నివేదిక తర్వాతే వెల్లడిస్తామని వెల్లడించారు.
అన్నదాతల ప్రాణాలు పోతున్నా కేంద్రం స్పందించట్లేదని.. రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని హరియాణా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపీందర్ సింగ్ హుడా డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రైతులతో ఏడో విడత చర్చలకు కేంద్రం సిద్ధం