ETV Bharat / bharat

శోకసంద్రమైన భారతావని-ఒక్కరోజే మూడు ప్రమాదాలు

author img

By

Published : May 7, 2020, 7:58 PM IST

Updated : May 7, 2020, 8:54 PM IST

యావద్దేశం కరోనాను అరికట్టేందుకు కృషి చేస్తున్న వేళ.. దేశవ్యాప్తంగా ఈ రోజు మూడు ప్రమాదాలు సంభవించాయి. విశాఖపట్నంలో గ్యాస్​ లీకేజీ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లో విషవాయువు ప్రభావం వల్ల ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్​లోని ఓ బాయిలర్​లో మంటలు చెలరేగాయి.

accidents
ఒక్కరోజే మూడు ప్రమాదాలు.

దేశవ్యాప్తంగా నేడు మూడు ప్రమాదాలు జరిగాయి. విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నగరంలోని గోపాలపట్నం వేపగుంట వద్ద ఉన్న ఎల్జీ పాలిమర్స్‌లో ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటలకు గ్యాస్ లీకేజీ అయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మంది తీవ్ర అస్వస్థతకు గురై విశాఖలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషవాయువు ప్రభావం కారణంగా మూగజీవాలు సైతం ప్రాణాలొదిలాయి.

పూర్తి కథనం: కళ్లు తెరవక ముందే కమ్మేసింది విషవాయు మేఘం

ఛత్తీస్​గఢ్​ రాయ్​గడ్​ జిల్లా తెత్లాలో విషవాయువు కారణంగా ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఓ పేపర్​మిల్లులో నిరుపయోగంగా పడి ఉన్న ట్యాంక్​ను శుభ్రం చేసేందుకు బాధితులు వెళ్లారు. చాలా కాలం నుంచి ఉపయోగించని కారణంగా ట్యాంకులో విషవాయువులు తయారయ్యాయని సమాచారం.

పూర్తి కథనం: పేపర్​ మిల్లులో గ్యాస్​ లీక్​.. ముగ్గురి పరిస్థితి విషమం

తమిళనాడు కడలూరులోని నైవేలీ లిగ్నైట్​ కార్పొరేషన్​(ఎన్​ఎల్​సీ)కి చెందిన థర్మల్ పవర్​స్టేషన్​లో నేడు అగ్నిప్రమాదం జరిగింది. ఓ బాయిలర్​లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. 27మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను ఎన్​ఎల్​సీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రికల్ స్విచ్ బాక్స్ పేలిందని.. ఇదే ప్రమాదానికి కారణమైందని సమాచారం.

నైవేలీలో అగ్నిప్రమాదం

ఇదీ చూడండి: స్టైరీన్ లీకేజీ... విశాఖలో విషాదం

Last Updated : May 7, 2020, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.