ETV Bharat / bharat

యూపీలో కిసాన్​ మహాపంచాయత్​- వేల మంది హాజరు - బీకేయూ మహా పంచాయత్​ సభకు వేల సంఖ్యలో పాల్గొన్న రైతన్నలు

సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్​ యూనియన్​(బీకేయూ) యూపీ ముజఫర్​నగర్​లో నిర్వహించిన 'మహా పంచాయత్'​ కార్యక్రమానికి వేల సంఖ్యలో రైతులు తరలివచ్చారు. అన్నదాతల జీవన్మరణ సమస్యపై కలిసికట్టుగా పోరాడదామని ఆర్ఎల్​డీ అధినేత అజిత్​ సింగ్ తన మద్దతు తెలిపారు.

Thousands of farmers attend mahapanchayat in Muzaffarnagar to back BKU
'ఇది రైతుల జీవన్మరణ సమస్య- కలిసికట్టుగా పోరాడుదాం'
author img

By

Published : Jan 29, 2021, 6:44 PM IST

ఉత్తర్​ప్రదేశ్​​ ముజఫర్​నగర్​లో భారతీయ కిసాన్​ యూనియన్​(బీకేయూ) నిర్వహించిన 'మహా పంచాయత్​' కార్యక్రమంలో వేల మంది రైతులు పాల్గొన్నారు. దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా జీఐసీ మైదానంలో వందల ట్రాక్టర్​లలో అన్నదాతలు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్​ అంతరాయం ఏర్పడింది.

ఆర్​ఎల్​డీ మద్దతు

రాష్ట్రీయ లోక్​ దల్​(ఆర్​ఎల్​డీ) అధినేత అజిత్​ సింగ్ బీకేయూకు మద్దతు తెలిపారు. ఆయన తరఫున కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు జయంత్​ చౌదరి మహా పంచాయత్​ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీకేయూ అధ్యక్షుడు నరేశ్​ టికాయత్​, ప్రతినిధి రాకేశ్ టికాయత్​తో ఆర్ఎల్​డీ అధినేత అజిత్​ సింగ్​ మాట్లాడారని చౌదరి తెలిపారు.

"ప్రస్తుతం రైతులు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయినా అన్నదాతలు దిగులు పడొద్దు. దీనిపై కలిసికట్టుగా పోరాడదాం" అని అజిత్​ సింగ్ సందేశాన్ని ట్వీట్​ చేశారు జయంత్.

UP MUZAFURNAGAR MAHA PANCHAYAT PROGRME BY BKU
వేల సంఖ్యలో రైతులు హాజరు

మహా పంచాయత్ సభలో పాల్గొన్న అన్నదాతలు

భారతీయ కిసాన్​ యూనియన్​(బీకేయూ)కు టికాయత్ సోదరులు నేతృత్వం వహిస్తున్నారు. రైతు చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ రెండు నెలలుగా ఘాజీపుర్​లో ఆందోళనలు చేపడుతున్నారు. అయితే నిరసనకారుల్ని ప్రభుత్వం బలవంతంగా అక్కడి నుంచే పంపేసే అవకాశముందంటూ రాకేశ్​ గురువారం భావోద్వేగానికి గురైన నేపథ్యంలో ముజఫర్​నగర్​ సభకు భారీగా రైతులు తరలిరావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మహా పంచాయత్​లో రైతన్నలు

ట్రాక్టర్​లపై సభకు వెళ్తున్న రైతన్నలు

మహా పంచాయత్​లో మాట్లాడుతున్న నాయకులు

ఇదీ చదవండి : 'రైతులపై దాడితో దేశం బలహీనం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.