అలవాటైన చేతి వాటంతోనే మాతృభాషలో కుడి నుంచి ఎడమకు రాయడానికి తికమక పడతాం. అయినా కొందరు సాధన చేసి.. రెండు చేతులతో రాసి ప్రత్యేకంగా నిలుస్తారు. ఆ తరహా వ్యక్తే కర్ణాటక గుడ్డెబళ్లూరుకు చెందిన బసవరాజ్. తన రెండు చేతులతో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మాతృభాష సహా నాలుగు భాషల్లో రాస్తూ అందరినీ అబ్బుర పరుస్తున్నాడు.
నాలుగు భాషల్లో ప్రత్యేక ప్రతిభ
ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు రాయడాన్ని 2011 నుంచి సాధన చేస్తున్న బసవరాజ్.. ప్రస్తుతం తెలుగు, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లో అలవోకగా రాయగలడు. ఈ ప్రతిభే అతడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కేలా చేసింది.
ఇదీ చూడండి: అబ్బురపరిచే ప్రతిభ.. చేతిరాతతో ప్రపంచ రికార్డు కైవసం