ఆత్మ నిర్భర్ భారత్ పథకం మూడో విడత ప్యాకేజీలో భాగంగా.. వ్యవసాయ ఉత్పత్తుల అంతర్ రాష్ట్ర అమ్మకాలపై ఉన్న అడ్డంకులను తొలిగించాలని ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ ప్రకటన ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూర్చినట్లైందని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమంతోనే దేశ అభివృద్ధి దాగుందని మోదీ ప్రభుత్వం విశ్వసిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రైతులకు లబ్ది చేకూర్చి, దేశాన్ని స్వయం సమృద్ధివైపు నడిపించేందుకు మోదీ దూరదృష్టితో ఆలోచిస్తున్నారని తెలిపారు. శుక్రవారం కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో.. రైతులకు లబ్ది చేకూర్చడమే కాకుండా వారికి ఆదాయాన్ని పెంచుతుందని భాజపా నేత జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.
-
मोदी सरकार का विश्वास है कि किसानों के कल्याण में भारत का कल्याण निहित है। आज किसानों को दी गयी यह अभूतपूर्व सहायता मोदी जी की किसानों को सशक्त बनाकर देश को आत्मनिर्भर बनाने की दूरदर्शिता को दर्शाता है। इसके लिए मैं @narendramodi जी और @nsitharaman जी को बधाई देता हूँ।
— Amit Shah (@AmitShah) May 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">मोदी सरकार का विश्वास है कि किसानों के कल्याण में भारत का कल्याण निहित है। आज किसानों को दी गयी यह अभूतपूर्व सहायता मोदी जी की किसानों को सशक्त बनाकर देश को आत्मनिर्भर बनाने की दूरदर्शिता को दर्शाता है। इसके लिए मैं @narendramodi जी और @nsitharaman जी को बधाई देता हूँ।
— Amit Shah (@AmitShah) May 15, 2020मोदी सरकार का विश्वास है कि किसानों के कल्याण में भारत का कल्याण निहित है। आज किसानों को दी गयी यह अभूतपूर्व सहायता मोदी जी की किसानों को सशक्त बनाकर देश को आत्मनिर्भर बनाने की दूरदर्शिता को दर्शाता है। इसके लिए मैं @narendramodi जी और @nsitharaman जी को बधाई देता हूँ।
— Amit Shah (@AmitShah) May 15, 2020
క్షమాపణ చెప్పాల్సిందే..
రైతుల పట్ల మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. కరోనా ఆర్థిక ప్యాకేజీలో రైతులను బేఖాతరు చేసినందుకు ప్రధాని, ఆర్థిక మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా. ఇప్పటికే మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ జుమ్లా ప్యాకేజీ(ఉత్తుత్తి ప్యాకేజీ)గా తేలిపోయిందన్నారు.