దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవాన్ని.. ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం చక్కటి అవకాశాన్ని కల్పించింది. పద్మ అవార్డులపై క్విజ్ పోటీ నిర్వహించి.. గెలిచినవారికి పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించనుంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా... ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
పద్మ అవార్డుల విజేతల జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయమని, అలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారికోసం ఈ పోటీ నిర్వహిస్తున్నామని మోదీ తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ప్రధాని.. పద్మ క్విజ్ లింక్‌నూ జత చేశారు.
-
Every year, several grassroots level achievers are honoured with Padma Awards. Their life journeys inspire many.
— PMO India (@PMOIndia) March 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Here is a unique quiz competition, the Padma Quiz which gives you an opportunity to witness the Padma Awards ceremony at Rashtrapati Bhavan.https://t.co/J2XksCDyF0 pic.twitter.com/5XCa7Hkq43
">Every year, several grassroots level achievers are honoured with Padma Awards. Their life journeys inspire many.
— PMO India (@PMOIndia) March 9, 2020
Here is a unique quiz competition, the Padma Quiz which gives you an opportunity to witness the Padma Awards ceremony at Rashtrapati Bhavan.https://t.co/J2XksCDyF0 pic.twitter.com/5XCa7Hkq43Every year, several grassroots level achievers are honoured with Padma Awards. Their life journeys inspire many.
— PMO India (@PMOIndia) March 9, 2020
Here is a unique quiz competition, the Padma Quiz which gives you an opportunity to witness the Padma Awards ceremony at Rashtrapati Bhavan.https://t.co/J2XksCDyF0 pic.twitter.com/5XCa7Hkq43
20 ప్రశ్నలతో క్విజ్..
20 ప్రశ్నలుండే ఈ క్విజ్‌లో.. గెలిచిన వారిలో కొంతమందిని ఎంపిక చేసి మార్చి 20న రాష్ట్రపతి భవన్‌లో జరిగే పద్మ అవార్డుల కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు.
ఏటా గణతంత్ర దినోత్సవం రోజున పద్మ అవార్డులను ప్రకటిస్తారు. ఈ ఏడాది 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించారు.
ఇదీ చదవండి: 71వ గణతంత్ర భారతావని... ఎంపికైన పద్మ గ్రహీతలు వీరే