దేశంలో కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సభ్యుల భద్రత కోసం అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. దీంతో ఈసారి పార్లమెంటు సమావేశాలు సరికొత్తగా జరుగుతున్నాయి.
యాప్ ద్వారా హాజరు..
ఎంపీల హాజరును నమోదు చేసేందుకు కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది పార్లమెంటు సచివాలయం. రిజిస్టర్‌కు బదులుగా ఈ యాప్‌ను వినియోగించి సభ్యుల హాజరు నమోదు చేశారు.
సమావేశాల్లో భాగంగా మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్‌సభ, అనంతరం రాజ్యసభను నిర్వహించాలని నిర్ణయించారు.
సీటింగ్ ప్లాన్..
కరోనా నేపథ్యంలో సభ్యుల మధ్య రక్షణగా బెంచీలపై ప్లాస్టిక్ షీల్డ్ ఏర్పాటు చేశారు. సభ్యులను పూర్తిగా వేరు చేసేలా వీటిని అమర్చారు. లోక్‌సభ ఛాంబర్లో 200 మంది కూర్చున్నారు. వీక్షకుల గ్యాలరీలో మరో 30 మంది ఎంపీలు ఆసీనులయ్యారు. మరికొంత మంది రాజ్యసభ ఛాంబర్లో కూర్చున్నారు.
స్పీకర్ పోడియానికి కుడివైపున సీటుపై నంబర్ 1 అని మార్క్ చేసిన సీటును ప్రధాని నరేంద్రమోదీకి కేటాయించారు. సాధారణంగా ఆరుగురు కూర్చునే బెంచీల్లో ముగ్గురు సభ్యులకే అనుమతిచ్చారు అధికారులు.
ప్రశ్నోత్తరాల రద్దు..
కరోనా నేపథ్యంలో సభా సమయాన్ని తగ్గించటం వల్ల ప్రశ్నోత్తరాలను రద్దు చేసినట్లు కేంద్రం తెలిపింది. ప్రజా సమస్యలపై చర్చించడానికి అరగంట పాటు శూన్యగంటను నిర్వహించారు.
సభ వాయిదా..
తొలిరోజు లోక్‌సభను మధ్యాహ్నం వరకు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో సభను వాయిదా వేశారు స్పీకర్. తిరిగి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి: తొలిరోజు సెషన్లో ప్రశ్నోత్తరాల అంశంపై వాడీవేడి చర్చ