ETV Bharat / bharat

దేశంలోనే తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్! - first woman ambulance driver Veeralakshmi

అంబులెన్స్ డ్రైవర్ అంటే ఆశామాషీ ఉద్యోగం కాదు. నిండు ప్రాణాలను కాపాడగలిగే బాధ్యత. అయితే, మన దేశంలో ఇప్పటివరకు పురుషులు మాత్రమే చేయగలరనుకున్న ఆ ఉద్యోగంలో తొలిసారిగా ఓ వీరనారి అడుగుపెట్టింది. దేశంలో తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్​గా బాధ్యతలు చేపట్టింది.

The Journey of Tamilnadu's first woman ambulance driver Veeralakshmi
దేశంలోనే తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్!
author img

By

Published : Sep 28, 2020, 9:11 AM IST

దేశంలోనే తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్!

కొనఊపిరితో పోరాడుతున్న పేషెంట్లను వాహనంలో ఎక్కించుకుని.. రోడ్లు ఎలా ఉన్నా వేగంగా, సురక్షితంగా ఆసుపత్రికి చేర్చడం అంటే మాటలా? అందుకే, అంబులెన్స్ డ్రైవర్ ఉద్యోగంలో చేరడమంటే పెద్ద సవాలే. అయితే, ఆ సవాళ్లను సునాయాసంగా స్వీకరించింది తమిళనాడుకు చెందిన ఓ వీర వనిత. దేశంలోనే తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్​గా బాధ్యతలు చేపట్టింది.

థేని జిల్లాకు చెందిన వీర లక్ష్మీ.. భర్త ఓ ట్యాక్సీ డ్రైవర్. భర్త ఒక్కడి సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో తమ ఇద్దరు బిడ్డలను ప్రభుత్వ బడిలో చేర్చి.. తానూ ట్యాక్సీ డ్రైవర్​గా మారింది లక్ష్మీ. బంధువులు, ఇరుగు పొరుగు వారు దెప్పి పొడుస్తున్నా.. వెనకాడలేదు. భర్త ప్రోత్సాహం ఉంటే చాలనుకుని సాగిపోయింది. కరోనా లాక్​డౌన్ వేళ.. చెన్నై ప్రభుత్వాసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్లు కావాలంటూ విడుదలైన ఓ ప్రకటన వీరలక్ష్మీ కంటపడింది.

ఎలాగో వాహనం నడపడం వచ్చు కాబట్టి ఓ సారి దరఖాస్తు చేసి చూద్దామని ప్రయత్నించింది వీరలక్ష్మీ. ఇంటర్వ్యూకు హాజరై ఆ ఉద్యోగానికి ఎంపికైంది. దీంతో, భారత దేశంలోనే తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్​గా గుర్తింపు పొందింది.

ఇదీ చదవండి: 104 ఏళ్ల వయసులోనూ ఉచితంగా పాఠాలు బోధిస్తూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.