కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ రూ.4 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ను 'విపత్తు'గా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్ వల్ల మరణించిన వారి కుటుంబాలను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్) ద్వారా ఆర్థికంగా ఆదుకోనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో పాటు ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వం భరించనుంది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య 85కు చేరింది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మోదీ సూచనలు..
కరోనా నియంత్రణకు పాటించాల్సిన జాగ్రత్తలను కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిని జత చేస్తూ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ముఖ్యమైన విషయాన్ని అందరూ చదవాలని సూచించారు.
-
Some important information here.
— Narendra Modi (@narendramodi) March 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Do read👇🏼. https://t.co/sZrLgHFTH8
">Some important information here.
— Narendra Modi (@narendramodi) March 14, 2020
Do read👇🏼. https://t.co/sZrLgHFTH8Some important information here.
— Narendra Modi (@narendramodi) March 14, 2020
Do read👇🏼. https://t.co/sZrLgHFTH8
- ఇంట్లో ఉండేవారు సాధ్యమైనంత వరకు ఏకాంత గదిలో ఉండాలి.
- వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.
- పెద్దలు, పిల్లలు, గర్భిణీలకు దూరంగా ఉండండి.
- మీ గదిలోకి వేరే వారు వస్తే కనీసం ఒక మీటర్ దూరం పాటించండి.
ఇంట్లో ఉండటం ద్వారా కరోనా వైరస్ బారిన పడకుండా ఉండవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.