కేన్సర్, మధుమేహం, ఊబకాయం, రక్తహీనత వంటి అనేక వ్యాధులతో పోరాడే రోగ నిరోధక శక్తి ఈ బియ్యంలో ఉన్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్న ఈ బియ్యానికి భారీ డిమాండ్ ఉంది.
మార్కెట్లో ఈ బియ్యం కేజీ రూ.400 నుంచి రూ. 500 రూపాయల దాకా ధర పలుకుతుంది. 155 రోజుల్లో పండే ఈ వరి పంటను మార్కెట్లో విక్రయిస్తే లాభాలు బాగానే ఉంటాయి కనుక రైతులూ ఈ పంట పండించడంలో ఉత్సాహం చూపుతున్నారు.
'ఈ పంటకు ఎలాంటి వ్యాధులూ సోకవు. రసాయనాలు అవసరం లేదు. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. అందుకే ఔషధం వంటి ఆహారం ఈ బియ్యంలో పొందవచ్చు. ఇవి తింటే మూడు నెలల్లో మధుమేహం కూడా సాధారణ స్థితికి వచ్చేస్తోంది. గర్భిణీలకు మూడు నెలల పాటు ఈ బియ్యాన్నే ఆహారంగా పెడితే, ఐరన్ మాత్రలు వేసుకునే పనే ఉండదు.'
-రాం అఖ్బాల్ తివారీ, రైతు
చైనా నుంచి భారత దేశ ఈశాన్య ప్రాంతానికి వలస వచ్చింది ఈ బ్లాక్ రైస్. ఆ ప్రాంతంలో సరైన ఆరోగ్య వసతులు, పోషకాహారాలు లేకపోయినా అక్కడివారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. వారి ఆరోగ్యం వెనుక రహస్యం ఏంటో తెలుసుకోవాలని పరిశోధన చేసినప్పుడు తేలిందేమిటంటే..అక్కడివారు ఈ బియ్యంతో వండిన అన్నం తినేవారట. అంటే ఈ బియ్యంలో రోగనిరోధక శక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు.
'ఇది ప్రధానంగా చైనా ధాన్యం. అక్కడి రాజపరివారం ఈ బియ్యాన్ని తినేవాళ్లని చెబుతుంటారు. చైనా మొత్తం వీటిని పండించేవారు. అయితే రాజులు మాత్రమే తినే బియ్యం కావడం వల్ల అక్కడి రైతులు పండించడం మానేశారు. మన ఈశాన్య రాష్ట్రాల ప్రజలు చైనీయులుకు దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడా ఈ బియ్యం లభిస్తున్నాయి.'
-ఏ కే సింహ, డిప్యూటీ అగ్రికల్చరల్ డైరెక్టర్
ఇదీ చదవండి:మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం శివసేనదే..!