భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్ సాయంతోనే ప్రణబ్‌కు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కీలకమైన పారామితులు స్థిరంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎప్పటికప్పడు ఆయన్ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
మెదడుకు సంబంధించి శస్త్రచికిత్స కోసం ఆర్మీ ఆసుపత్రిలో చేరారు ప్రణబ్. అప్పటికే ఆయనకు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈనెల 10న ఆపరేషన్ నిర్వహించారు.
ఇదీ చూడండి: పోలీస్ స్టేషన్లో 16 నాగరాజులు మకాం!