ETV Bharat / bharat

మోదీ 2.0: ఆది నుంచే కరోనాపై అసాధారణ పోరు - మోదీ 2.0

ప్రపంచమంతటా కరోనా కల్లోలం రేపుతోంది.. మహమ్మారి వలలో చిక్కి అమెరికా లాంటి మహామహాదేశాలే అల్లాడిపోతున్నాయి. భారత్‌లోనూ వైరస్‌ వ్యాప్తి చెందుతున్నా... నియంత్రించడంలో ప్రారంభం నుంచీ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రశంసనీయ చర్యలు చేపట్టింది.

The central government that has taken control of the corona from the beginning
ఆది నుంచే కరోనాపై అసాధరణ పోరు
author img

By

Published : May 30, 2020, 7:38 AM IST

దాదాపు 136 కోట్ల జనాభా.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సరిగా లేని భారత్‌లో కరోనాను కట్టడి చేయడమంటే సాధారణ విషయం కాదు. కానీ మోదీ సర్కారు ఆరంభం నుంచే వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. వైరస్‌ ఉనికి కనిపించి ఇప్పటికి 17 వారాలవగా లక్షన్నరకు పైగా కేసులు బయటపడ్డాయి. అయితే వ్యాప్తి తీవ్రతను తగ్గించడంలో, మరణాలను నియంత్రించడంలో, రికవరీలోనూ చెప్పుకోదగ్గ పురోగతి ఉంది. పది దేశాల్లో లక్షన్నరకు పైగా కేసులున్నాయి. వాటిలో భారత్‌, రష్యా, టర్కీల్లోనే మరణాలు తక్కువగా ఉన్నాయి. అయితే... రష్యా, టర్కీల్లో జనాభా వరుసగా 14.5 కోట్లు, 8.5 కోట్లు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 6.11% (శుక్రవారం నాటికి) ఉంటే, భారత్‌లో ఇది 2.84% మాత్రమే. ఇది కూడా క్రమేపీ తగ్గుతూ వస్తుండటం ఊరటే. అలాగే రికవరీ రేటు భారత్‌లో 42.88 శాతం ఉంది. అంటే కొవిడ్‌ బారిన పడుతున్న ప్రతి 100 మందిలో దాదాపు 43 మంది వరకు కోలుకుంటున్నారు.

కీలక నిర్ణయాలు.. చర్యలు

  • కరోనాను అడ్డుకునేందుకు మోదీ మార్చి 22న జనతా కర్ఫ్యూ ప్రకటించారు.
  • మార్చి 24 నుంచి తొలివిడత పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఇంత పెద్ద దేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం అసాధారణమే. తర్వాత 3 దఫాలుగా సడలింపులతో పొడిగిస్తూ వచ్చారు.
  • లాక్‌డౌన్‌ నిర్ణయం భారత్‌లో కరోనా కేసులు.. ప్రజారోగ్య వ్యవస్థ పరిమితిని మించి ఒత్తిడికి గురికాకుండా చూడటానికి దోహదపడింది. కేసులు రెట్టింపయ్యే కాలపరిమితిని పెంచగలిగింది.
  • కరోనా కట్టడిలో భాగంగా ప్రధాని మోదీ ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా భారీ ఆర్థిక ఉద్దీపన(ప్యాకేజీ)ని ప్రకటించారు.
  • లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ ఆహారం, మందులు సరఫరా అయ్యేలా చూడగలిగారు. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేశాయి.
  • భారత్‌లోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ ప్రజలను కాపాడేందుకు భారీఎత్తున హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ప్రభుత్వం సరఫరా చేసింది.
  • వలస కార్మికులకు కష్టాలు తప్పనప్పటికీ.. ప్రభుత్వ సానుకూల విధానాలతో ఎక్కువ మంది ప్రాణాలను కాపాడిందని నిపుణులు చెబుతున్నారు.

డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు

  • కొవిడ్‌ కష్టకాలంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కొనియాడింది.
  • లాక్‌డౌన్‌, కొవిడ్‌ పరీక్షలను పెంచడం వంటి నిర్ణయాలతో మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయగలిగారంటూ మోదీ నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని.. మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ కొనియాడారు. ఆరోగ్య సేతు యాప్‌తోపాటు కేసుల గుర్తింపు, హాట్‌స్పాట్‌ల గుర్తింపు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి విషయాల్లో సాంకేతికతను భారత ప్రభుత్వం చక్కగా వినియోగించిందని కొనియాడారు. మోదీ తీసుకున్నవి సానుకూల నిర్ణయాలుగా పేర్కొన్నారు. భారతీయులందరికీ తగిన సామాజిక రక్షణ కల్పించారని ప్రశంసించారు.
  • హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఎగుమతులపై పాక్షిక నిషేధాన్ని ఎత్తివేయడంపై మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసించారు.

ఇలా అడుగులు

దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచారు. రోగులకు వేల సంఖ్యలో కొత్తగా పడకలను అందుబాటులోకి తెచ్చారు. వైద్యులకు రక్షణ పరికరాలు, దుస్తులతో పాటు, మాస్కులు, శానిటైజర్లు వంటివి అందుబాటులో ఉండేలా చూశారు. కరోనాపై పోరులో ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజలూ సహకారం అందించారు.

అందరికీ చదువు

రెండోసారి అధికారంలోకి వచ్చాక మోదీ విద్యారంగంపై దృష్టి సారించారు. భావి భారత పౌరులకు చక్కటి చదువు అందించడం ద్వారానే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని... ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో విద్యకు రూ.99,300 కోట్లు కేటాయించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడంలో భాగంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణకు రూ.3000 కోట్లు ప్రత్యేకించారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో... పాఠశాలలకు దూరమైన చిన్నారులను డిజిటల్‌ తరగతుల వైపు మళ్లించాలని ఆయా సంస్థలకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు దూరదర్శన్‌ ద్వారా ఆన్‌లైన్‌ బోధనకు ఆదేశించారు.

  • పిల్లల్లో అంతరిక్షంపై జిజ్ఞాస కలిగించడానికి దేశవ్యాప్తంగా 60 మంది ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులను ఎంపిక చేసి, ఇస్రో ప్రధాన కార్యాలయంలో 'ధ్రువ్‌' అనే పథకాన్ని ప్రారంభించారు.

ఇదీ చూడండి... జూన్​ 15 వరకు లాక్​డౌన్.. కొత్త నిబంధనలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.