కరోనా సంక్షోభ సమయంలో నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు 2019-20 కాలానికి సంబంధించిన ప్రత్యేకమైన బిల్లుకు ఆమోదముద్ర వేసింది కేంద్ర కేబినెట్. ఈ నిర్ణయంతో దాదాపు 30 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
ఇందుకు రూ.3,737 కోట్లు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. ఈ బోనస్‌ను విజయదశమి ముందుగానే ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా ఒక్కసారి సెటిల్మెంట్ చేయనున్నారు.