భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన ‘వ్యోమమిత్ర’ రోబో ఇటీవల అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘నేను సగం హ్యూమనాయిడ్ రోబోను. వ్యోమమిత్రను’ అంటూ బెంగళూరులో ఏర్పాటయిన సదస్సులో ఈ రోబో తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకుంది. మానవ రూపాన్ని పోలిన రోబోల (హ్యూమనాయిడ్ రోబో) రంగంలో ఇదో ముందడుగు. గగన్‌యాన్ పరిశోధనలో భాగంగా ‘ఇస్రో’ చేపట్టే మానవ రహిత యాత్రలో భాగంగా ఇది రోదసిలోకి అడుగుపెట్టనుంది. అంతరిక్షంలో దాదాపుగా మనుషుల తరహాలోనే ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుంది. వ్యోమగాములకు అవసరమైన జీవనాధార ఆపరేషన్లు, ఆక్సిజన్ సమాచారాన్ని ఇది అందిస్తుంది. అంగారక గ్రహంపై ప్రయోగం కోసం అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ 300 పౌండ్ల బరువున్న హ్యూమనాయిడ్ రోబోను ప్రత్యేకంగా రూపొందించింది. నిరంతరాయంగా చుట్టుపక్కల వాతావరణాన్ని పరిశీలించగల బహుళ పార్శ్వ కెమెరాలు, 3-డీ స్టీరియోలు, వీడియోలతో దీన్ని తయారు చేశారు. హ్యూమనాయిడ్ రోబోల తయారీపై అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కొంతకాలంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాటి వినియోగం ఇనుమడించడమే ఇందుకు కారణం.
కొత్త ప్రపంచం వైపు..
ఈ రోబోలు అచ్చు మానవ రూపాన్ని పోలి ఉండటంతో పాటు సాధారణ మనుషుల మాదిరిగా సంభాషించడం, నడవడం, అభిప్రాయాలు పంచుకోవడం వంటి పనులు చేస్తాయి. ఇందులో కొన్ని రకాల రోబోలు అంతకుముందు నెరపిన సంభాషణలనూ గుర్తుచేయగలవు. మానవరూప రోబోలు భావోద్వేగాలనూ వ్యక్తం చేయగలవని నిరూపించేందుకు శాస్త్రవేత్తలు పట్టుదలగా పనిచేశారు. హాంకాంగ్ కంపెనీ రూపొందించిన హ్యూమనాయిడ్ రోబో సోఫియా 50 రకాల భావాలు వ్యక్తీకరించగలదు. ముఖాలను, దృశ్యాలను గుర్తించగలదు. మనుషుల హావభావాలు అనుకరించగలదు. దానితోపాటు మనుషులతో కొద్దిపాటి సంభాషణనూ కొనసాగించగలదు. అందమైన మహిళను పోలినట్టుండే మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోను చైనా నాలుగేళ్ల క్రితం రూపొందించింది. దానిపేరు జియా! ఈ రోబో వాతావరణం ఎలా ఉందో చెప్పగలదు. కళ్ల కదలికలు, సంభాషణలు పలికేటప్పుడు పెదాలు సరిపోవడం (లిప్ సింక్రనైజేషన్) వంటి అంశాల విషయంలో నిపుణులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ రోబోను తయారు చేశారు. కృత్రిమమేధ రంగంలో పరిశోధనలు ఊపందుకుంటున్నాయి. ఫలితంగా రోబోల రూపకల్పనలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చైనాలో రెస్టారెంట్లు, నర్సింగ్ హోంలు, ఆస్పత్రులు, గృహాల్లో విస్తృతంగా రోబోల వినియోగంవైపు కదులుతున్నారు. అమెరికా, కెనడా, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, సింగపూర్‌లు రోబోల తయారీలో చురుగ్గా ఉన్నాయి. ఇందులో కొన్ని దేశాలు కృత్రిమ మేధ పరిశోధనలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నాయి.
జపాన్ శాస్త్రవేత్తలు 2014లో వార్తలు చదివే మొట్టమొదటి ఆండ్రాయిడ్ రోబోకు రూపకల్పన చేశారు. బీనా-48 పేరుతో తయారైన రోబో- రచయిత, వ్యాపారవేత్తయిన మార్టిన్ రోత్ బ్లాట్ మార్గదర్శకంలో అచ్చు ఆయన భార్య పోలికలతో రూపుదిద్దుకుంది. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్‌తోపాటు అనేక టీవీ షోల్లో ఇది ప్రత్యక్షమైంది. 2025నాటికి కార్మికులు చేపట్టే పనుల్లో పాతిక శాతం రోబోలే చేస్తాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వీటి సామర్థ్యం పెరగడం, తయారీ ఖర్చులు క్రమంగా తగ్గుతుండటం ఇందుకు కారణం. కంప్యూటర్, ఎలెక్ట్రానిక్ ఉత్పత్తులు, విద్యుత్ ఉపకరణాలు, గృహోపకరణాల పరిశ్రమలు, రవాణా ఉపకరణాల్లోనూ రోబోల వినియోగం పెరుగుతోంది. వీటివల్ల సేవల రంగం అన్నింటి కంటే ఎక్కువగా ప్రభావితమవుతుందని భావిస్తున్నారు. 2016లో 2.96 కోట్ల యూనిట్లుగా ఉన్న హ్యూమనాయిడ్ రోబోల వినియోగం, 2026 నాటికి 26.43 కోట్ల యూనిట్లకు పెరుగుతుందన్న అంచనాలున్నాయి (బెర్గ్ ఇన్‌సైట్ నివేదిక). 2018లో ప్రపంచ విపణిలో రోబో పరిశ్రమ పరిమాణం 3,801 కోట్ల డాలర్లుంటే, 2023 నాటికి అది 6,400 కోట్ల డాలర్లకు చేరుతుందని బీసీసీ పరిశోధన సంస్థ అంచనాలు వెల్లడిస్తున్నాయి. జర్మనీ పరిశ్రమల రంగంలో రోబోల వినియోగం అధికంగా ఉంది. అక్కడ సగటున 10వేల మంది ఉద్యోగులకు 309 రోబోలను వినియోగిస్తున్నారు. మిగిలిన దేశాలతో పోలిస్తే అది చాలా ఎక్కువ.
మానవుల ప్రవేశానికి దుర్లభమైన ప్రదేశాల్లో రోబోల సేవలు ఉపయోగపడుతున్నాయి. ఇటాలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థ రూపొందించిన ‘వాక్ మ్యాన్’ ప్రత్యేకమైంది. 2015లో మొదటిసారిగా రూపొందించిన రోబోను ఆ తరవాత అదనపు సాంకేతిక హంగులు జోడించి ఆధునికీకరించారు. ఆరడుగుల ఎత్తు, 102 కిలోల బరువుతో దీనిని రూపొందించారు. ఒక కిలోవాట్ బ్యాటరీతో రెండుగంటల పాటు ఇది సేవలందించగలదు. గ్యాస్‌లీకేజి లాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ఇది తనంతట తానుగా గది తలుపులు తెరిచి లోపలకు ప్రవేశించగలదు. లీకేజిని గుర్తించి సంబంధిత వాల్వును మూసివేయగలదు. శిథిÅలాలనూ తొలగించగలదు. ఇంజినీరింగ్ కార్యకలాపాల్లోనూ రోబోల సేవలు వినియోగించుకుంటున్నారు. జాయింట్ రోబొటిక్స్ లేబొరేటరీ, ఎయిర్‌బస్ గ్రూపులు సంయుక్తంగా నాలుగేళ్లపాటు చేపట్టిన పరిశోధనలు సత్ఫలితాలనిచ్చాయి. ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ పనుల్లో కార్మికులకు ప్రత్యామ్నాయంగా, మనుషులకు ప్రమాదకరమైన పనులకూ రోబోలను వినియోగిస్తున్నారు.
అన్నింటా తామై..
జాయింట్ రోబొటిక్స్ లేబొరేటరీ రూపొందించిన హెచ్‌ఆర్‌పీ2, హెచ్‌ఆర్‌పీ4 రకాల రోబోలు అత్యంత ఎత్తయిన ప్రదేశాలకు నిచ్చెన సాయంతో ఎగబాకగలవు. కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రోబోలు స్వేచ్ఛగా చేతులు అటూ ఇటూ కదిలించటానికి అనువుగా, మనుషుల కండరాలను పోలిన విధంగా అమరికల కోసం కృషి చేశారు. తనకు వెయ్యిరెట్లు అధికమైన బరువును మోయగలగడం, శరీరాన్ని కదిలించడం, వంచడం తదితర చర్యలకు వీలుగా వాటికి ‘సింథటిక్ కండరాల’ను అమర్చారు. వృద్ధులు, పసిపిల్లలు, రోజువారీ అవసరాలు కోరుకునే వారికి రోబోలు తమ వంతు సహకారం అందిస్తున్నాయి. మాటలు సరిగ్గా రాని చిన్నారులకు తోడ్పాటును అందిస్తున్నాయి. వైద్యరంగంలో సహాయక పాత్రను ఇవి సమర్థంగా పోషిస్తున్నాయి. భద్రత విభాగంలో రోబోల పాత్ర చెప్పుకోదగింది. నేరాలను నియంత్రించడం, పసిగట్టడం వంటివి కృత్రిమ మేధ ద్వారా సాధ్యమవుతుంది. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పసిగట్టేందుకు వీలవుతుంది. వ్యవసాయం, ఆహార తయారీలోనూ వీటిని వాడుతున్నారు.
కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువుల మాదిరిగా హ్యూమనాయిడ్ రోబోలు మున్ముందు కుటుంబంలో ఓ భాగంలా మారతాయని భావిస్తున్నారు. నిజజీవితంలో రోబోలు మానవులకు సవాలు విసరడం ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా రోబోలకు ముందుగా ‘ప్రోగ్రామింగ్’ చేస్తారు. దాంతో అవి కేవలం తమకు నిర్దేశించిన బాధ్యతలు మాత్రమే చేపట్టగలవు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల శక్తి వాటికి లేకపోవడం లోటే. స్వీయ ఆలోచన సామర్థ్యం కొరవడటం, సొంతంగా విద్యుత్ సరఫరా ఏర్పాటు లేకపోవడం, బ్యాటరీ నియంత్రణ మేరకే పనిచేయగలగడం వంటి అంశాలు వాటికి పరిమితులు విధిస్తున్నాయి. మనిషిని పోలిన ఈ రోబోలను అభివృద్ధి వాహికలుగా ఉపయోగించుకునే ప్రయత్నాలు జోరందుకుంటున్న నేపథ్యంలో- ఇవి దేశాల ఆర్థిక వృద్ధికి చురుకు పుట్టించే సమర్థ సాధనాలుగా మారతాయనడంలో మరోమాట లేదు.
- పార్థసారథి చిరువోలు

Intro:Body:
Maedaram Mahajatara
Medaram Sammakka Saralalamma Maha Jatara, popularly known as Telangana Kumbhmela, was initiated on January 22, 2020 . Holy priests conducted the festival of Gudimeluge for the Sarlamma in Kannapalli, Sammakka in Tadwai Mandalam of Medarum village in Mulugu district of Telangana State. As is the tradition, the Kaka dynasties and Siddha dynasties cleaned their houses in the wee hours of the day and then also purified the shrines. The Doli and musical troupe then went to the nearest forest to collect the grass on the hillock which was later used to cover the deity podiums. Soon, the seats are further covered with silk, bangles and rangoli.
After the traditional incorporation, the Koya priests worshiped in the temple by lightening of the lamp. It is widely believed that the cauldron will last for two years. The festival of Gudimelige is considered to be the beginning of the great Medaram fair. The fair will continue for four Wednesdays from the day of initiation of the prayers in the temples. The festival of Mandamelige will be held on the second Wednesday ie., January 29th, 2020. The grand opening of Ammavarla Jatara starts on the third Wednesday, ie., February 5th, 2020. On the same day , the deities of Saralamma, Pagididdaraju and Govindaraju are brought from Kannepalli on to the podium .
On the second day, ie., on the 6th February, 2020, the deity of Sammakka which resides in the form of a Kumkum Bharine is brought on to the podium. On the third day, ie., on the 7th February, all the deities are displayed for darshan of thousands of pilgrims. On the fourth day ie., February 8th , the deities are moved back to their original location. This is followed by the return rituals on the next Wednesday ie., February 12th, 2020. The priests hail from the tribal families, as is the tradition which happens to be the specialty of the Medaram Jatara. Devotees offer gold (jaggery) as offerings to the deities. People of various religions, not just tribes, participate in the festival. With a participation of over a billion people, this is the largest mela in Asia.
Setting up of special buses
On the occasion of this Mela, the Telangana, the Telangana RTC operates four thousand buses to the Sammakka Saralamma Medaram Jatara. There are about 500 special buses plying from Rangareddy Region to Medaram. These special buses will be available from 2nd to 8th February, 2020. RTC officials urge pilgrims to take advantage of this facility as they are running buses from all parts of Hyderabad.
Two Helicopters always on demand
The CM of Telangana said that two helicopters will be available in Hyderabad from February 5th to 9th, for the Secretary General of the Government and other senior officials like the DGP to visit the camp and review the situation from time to time.
Establishment of a Harita Resort
For the comfort of all the pilgrims visiting Medaram, the Haritha Resorts has set up a guest house in the area. The resort was opened by Tourism Minister Srinivas Goud and was built under the aegis of the Panchayati Raj Minister Errabelli Dayakara Rao. The cost of the setting up of this resorts has been budgeted at Rs.9.37 crores. .
Special arrangements for lightening through the Mela period
Gopal Rao, CMD of NPDCL, visited the Medaram vicinity. He said that all measures have been taken care to ensure that there is a great deal of un-interrupted power in the first week of February. He said 300 employees have been recruited with 2 members per sub-station to avoid power outages in the area, during the said period.
24 hour medical services
The District Medical and Health Department is ready to provide 24 hour medical services to the devotees who come here in large numbers. The Government has allocated a budget of Rs 1.46 crore for medical services. The main medical camp with 50 beds was set up at TTD Kalyana Mandapam near Gaddela and 60 camps were set up in the surrounding areas of Jampannavagu and Chilakalagutta. A total of 130 doctors and 900 medical staff will serve in the camps, altogether. Arrangements have been made to provide medical services and surgeries for pregnant women with general medical care. Medical specialists from 8 departments of Warangal MGM hospital will be deployed. Around 33 ambulances will be kept ready for any sort of emergency. Until the end of the Mela and till all the devotees retreat, medical services will continue in the vicinity. All the doctors in all the hospitals in Muluga, Yeturinagaram and other hospitals are readied to provide medical services to the piligrims.
Exhibits of Tribal Lifestyle
The tribal welfare department is organizing a number of rituals to attract millions of devotees to the Medaram. The exhibits of the surrounding tribal areas are expected to be a special attraction. Arrangements have been made to organize cultural activities on a regular basis in the Hampi Theater, with hundreds of artists, in line with tribal cultural traditions. From time immemorial to the present day, the paintings of the inhabitants have been made. Today's generation of people who are not familiar with the traditions of the tribes are exposed so beautifully portrayed images of the tribal lifestyles.
Plastic-free Mela
The Sarpanch of Medaram, Chidam Baburao has made a commitment to make the Medaram Mela a plastic-free celebration. Sarpanch Babu Rao visited each of the stalls and implored to the vendors to not use the plastic covers for whatever the reason. He had also made sure that Flexies are put up requesting the devotees to avoid using plastic during the period of conducting the Mela. Sarpanch Chidambaram Baburao said that the public is taking the initiative to make the Maha Mela a Non-Plastic Free event in the first week of February.
Video Analytics Policy
Artificial intelligence will be used for the first time in a large-scale during the Medaram Jatara. Devotees' congestion will be controlled through video analytics. The missing people will be identified through the use of CC cameras and will be tracked on the vehicle fleet. The police department is making arrangements for the use of Artificial Intelligence in the prestigious Medaram Jatara also known as Telangana Kumbh Mela.
Conclusion: