ETV Bharat / bharat

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్​ ఠాక్రే: పవార్​ - మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే ఉంటారని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​ స్పష్టం చేశారు. కాంగ్రెస్-శివసేన-ఎన్సీపీలకు చెందిన కీలక నేతల భేటీ అనంతరం పవార్​ ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.

పవార్​
author img

By

Published : Nov 22, 2019, 7:42 PM IST

Updated : Nov 22, 2019, 7:56 PM IST

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం కొలువుతీరడం ఖాయమైంది. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ మేరకు సుదీర్ఘ చర్చలు జరిపిన మూడు పార్టీల అగ్ర నేతలు ప్రభుత్వ ఏర్పాటుపై ఏకాభిప్రాయానికి వచ్చారు.

ఈ విషయంపై ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​ స్పష్టతనిచ్చారు. శివసేన నేతృత్వంలో ఏర్పడనున్న సంకీర్ణ ప్రభుత్వంలో ఆ పార్టీ అధినేత ఉద్ధవ్​ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉంటారని పవార్​ ధ్రువీకరించారు.

ప్రభుత్వ ఏర్పాటు, అధికార పంపకాలపై ముంబయిలో 3 పార్టీల నేతలు భేటీ అయ్యారు. 3 గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చలో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రిత్వ శాఖల పంపకాలపై చర్చించినట్లు సమాచారం. చర్చలు ఫలప్రదంగా ముగిసినట్లు సమావేశం అనంతరం ఉద్ధవ్​ ఠాక్రే అన్నారు.

ఈ మేరకు రేపు 3 పార్టీల నేతలు మీడియా ముందుకు వస్తారని శరద్​ పవార్​ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అప్పుడే వెల్లడిస్తామన్నారు. గవర్నర్‌ను కలిసే అంశంపైనా రేపు నిర్ణయం తీసుకుంటామన్నారు పవార్.

చర్చలు కొనసాగుతాయి..

భేటీ అనంతరం కాంగ్రెస్-ఎన్సీపీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. శివసేనతో సానుకూలంగా చర్చలు జరిపామని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్​ చవాన్​ తెలిపారు. అయితే చర్చలు ఇంకా పూర్తి కాలేదని.. రేపు కూడా కొనసాగుతాయన్నారు. ముఖ్యమంత్రి అంశమై.. పవార్​ ప్రకటనపై స్పందించేందుకు చవాన్ నిరాకరించారు. పూర్తి స్థాయి చర్చలు జరిగాక ఈ విషయంపై మాట్లాడతామని పేర్కొన్నారు.

Chennai, Nov 22 (ANI): A 6-year-old girl was declared 'world's youngest genius' for solving maximum (2x2) Rubik's cube blindfolded and also reciting poems in the least time. Baby Sarah C has solved the puzzle in 2 minutes and seven seconds in her attempt to create a Guinness World Record. She was declared genius by the TamilNadu Cube Association on November 22. She recited poems of famous Tamil poet Vairamuthu. The event took place at Velammal Vidyalaya in Chennai. She was being felicitated by Velammal Vidyalaya for solving Rubik's cube puzzle blindfolded. While speaking to ANI, Baby Sarah C's father Charles said, "Sarah C has already done world record with 2 minutes and seven seconds and the Indian record in just within two minute and fifty four seconds." "Now, we are taking this footage of her for the Guinness Book of World Records. She started solving these problems at a very young age," Sarah's father added. Sarah was born on June 06, 2013 and is six-years old.
Last Updated : Nov 22, 2019, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.