తమిళనాడుకు చెందిన ఓ ఇంజినీర్.. వైద్య సిబ్బంది రక్షణను దృష్టిలో పెట్టుకుని, కరోనా పరీక్షలకు కావాల్సిన నమూనాలను సేకరించే సెమీ ఆటోమేటెడ్ రోబోను రూపొందించాడు.
కోయంబత్తూర్ జిల్లా, వెదప్పటికి చెందిన కార్తీక్ వలయుత్తం ఎలక్ట్రానిక్ ఇంజినీర్. ఇదివరకు కరోనా రోగుల వద్దకు, ఆహారం, మందులు తీసుకెళ్లే రోబోను తయారు చేసిన కార్తీక్ ఇప్పుడు. కరోనా అనుమానితుల ముక్కు, గొంతుల్లోంచి నమూనాలు సేకరించే రోబోను సృష్టించాడు.
ఫోన్‌తో పనిచేస్తుంది....
సుమారు 7 కిలోల బరువుండే ఈ రోబో.. స్మార్ట్ ఫోన్లోని ఓ యాప్ ద్వారా పనిచేస్తుంది. 360 డిగ్రీలు తిరగగల ఈ టెస్టింగ్ రోబో జాగ్రత్తగా నమూనాలను సేకరిస్తుంది. అంతే కాదు, కేవలం రెండు నిమిషాల్లో పనిపూర్తి చేసి తనను తాను శుభ్రపరుచుకుంటుంది. దీంతో వైద్య సిబ్బంది నమూనాలు సేకరించే సమయంలో కరోనా బారిన పడకుండా కాపాడుతుంది.
ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు రక్షణ కల్పించే ఈ రోబోను కేవలం మూడు రోజుల్లోనే తయారు చేశాడు కార్తీక్. రోబో తయారీకి రూ. 2000 ఖర్చయిందని.... దీనిని ప్రభుత్వం ధ్రువీకరించి.. ఆర్థిక సహకారం అందిస్తే... పూర్తి స్థాయి ఆటోమేటెడ్ రోబోను తయారు చేస్తానంటున్నాడు.
ఇదీ చదవండి: ఆసుపత్రి 'చిల్లర' నిర్వాకం.. వృద్ధ దంపతుల బందీ