రుతుపవనాల రాక ఆలస్యంతో వర్షాలు లేక తమిళనాడులో నీటి సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. మండుటెండలకు నీళ్లు లేక చాలా గ్రామాల్లో ప్రజలు విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని.. చెన్నైలోని అన్నా సలై ప్రాంతంలోని ఆనంద హోటల్ యాజమాన్యం ఓ నిర్ణయం తీసుకుంది.
కస్టమర్లకు మధ్యాహ్న భోజనం అందించలేమని తెలిపింది. ఈ అసౌకర్యానికి వినియోగదారులు సహకరించాలని కోరుతోంది.
"30 ఏళ్ల నుంచి హోటల్ నడుపుతున్నాం. మొదటి సారి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వర్షాలు లేవు, నీటి సరఫరా లేదు. నీళ్లు లేక కస్టమర్లకు అల్పాహారం మాత్రమే పెడుతున్నాం. మధ్యాహ్న భోజనం అందించటం నిలిపేశాం. రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. "
- ఆర్. నారాయణ, హోటల్ యజమాని.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. నీటి కోసం మండుటెండలో చేతిపంపుల వద్ద బారులు తీరుతున్నారు. తాగునీటి కొనుగోలు కోసం వందల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: తమిళనాట దాహం కేకలు- వరుణుడిపైనే ఆశలు