తమిళనాడులో డిసెంబర్ 27, 30 తేదీల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఎన్నికల నియమావళిని, ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి డబ్బు ఉన్నవాడికే పట్టం కట్టారు నడుకుప్పం గ్రామస్థులు. శక్తివేల్.. రూ.50 లక్షల రూపాయలు పెట్టి అధికార అన్నాడీఎంకే తరఫున సర్పంచ్ పదవిని కొనుగోలు చేశారు. ప్రతిపక్ష డీఎండీకే నుంచి మురుగన్ రూ.15 లక్షలు పోసి ఉప సర్పంచ్ పదవిని కొనేశారు.
ఈ నెల 15వ తేదీలోగా ఆ నగదును వారు చెల్లించి, పదువులను స్వీకరించాల్సి ఉంటుంది. ఆ ఇద్దరూ డబ్బు చెల్లించేస్తే.. గ్రామంలోని మరెవరూ ఎన్నికలకు నామినేషన్ వేయకూడదనేది అక్కడి ప్రజల తీర్మానం.
ఇదంతా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు కొందరు ఔత్సాహికులు. ఆ వీడియో కాస్తా వైరల్ అయ్యి.. జిల్లా కలెక్టర్ వరకు చేరింది. ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి మరి!
ఇదీ చదవండి:ఉద్విగ్న క్షణం: పదేళ్ల తరువాత ఎదురుపడ్డ తల్లి, తనయుడు