తమిళనాడులోని కోయంబత్తూరులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు చేపడుతోంది. కోయంబత్తూరులోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో... ఎన్ఐఏ అధికారులు, తమిళనాడు పోలీసులతో కలిసి ఏకకాలంలో 5 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానితుల నుంచి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ లు, సిమ్‌కార్డులు, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు.
కొద్ది రోజుల క్రితం ఐసిస్ తీవ్రవాది అజహరుద్దీన్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. దర్యాప్తులో అజహరుద్దీన్ ఇచ్చిన సమాచారంతోనే ఎన్ఐఏ ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాదులు శ్రీలంక నుంచి సముద్రమార్గం ద్వారా భారత్‌లో చొరబడినట్లు నిఘా సమాచారం అందించాయి.
ఉగ్రవాదానికి నిధులు సమీకరించడం సహా..... భారత్‌లో ఉగ్రదాడులకు ప్రణాళిక చేస్తున్న ఓ ముఠాను జులైలో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.
ఇదీ చూడండి: 'మంత్రులంతా కశ్మీర్ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలి'