ETV Bharat / bharat

చర్చలతోనే సమస్యకు పరిష్కారం: కేంద్రమంత్రి - farmers agitation delhi border

సాగు చట్టాలపై రైతులతో చర్చించేందుకు ఎప్పుడూ సిద్ధమే అని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుశోత్తం రూపాలా స్పష్టం చేశారు. జనవరి 15న జరిగాల్సిన 9వ విడత చర్చలు యథావిధిగా కొనసాగిస్తామన్నారు. చర్చలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.

Talks must continue: MoS Rupala on Jan 15 scheduled meeting with farmer groups
చర్చలతో సమస్యకు పరిష్కారం: కేంద్రమంత్రి
author img

By

Published : Jan 14, 2021, 5:19 AM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు ఎల్లవేళలా సిద్ధమే అని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుశోత్తం రూపాలా చెప్పారు. జనవరి 15న కేంద్రం, రైతు సంఘాల మధ్య జరగాల్సిన 9వ విడత చర్చలు యథావిధిగా కొనసాగుతాయని బుధవారం స్పష్టం చేశారు. ఇరువురి మధ్య చర్చలతోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.

సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో రైతులతో చర్చలు కొనసాగుతాయా? అనే ప్రశ్నకు పైవిధంగా బదులిచ్చారు రూపాలా. చర్చలు కచ్చితంగా జరగాలన్నారు. రైతులతో సంప్రదింపులకు కేంద్రం సిద్ధమని, చర్చలకు హాజరు కావాలో వద్దో వారే నిర్ణయించుకోవాలని వ్యవసాయ శాఖ మరో సహాయ మంత్రి కైలాశ్​ చౌధరి తెలిపారు.

సుప్రీంకోర్టు కమిటీలోని సభ్యులపై అసంతృప్తి వ్యక్తం చేసిన రైతు సంఘాలు, కమిటీ ముందు హాజరుకాబోమని ఇప్పటికే తేల్చి చెప్పాయి. సాగు చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళనలు యథావిధిగా కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. అయితే కేంద్రంతో 9వ విడత చర్చల్లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. చట్టాల రద్దు విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండబోదని ఉద్ఘాటించాయి.

ఇదీ చూడండి: లోహ్రీ మంటల్లో సాగు చట్టాల ప్రతులు దహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.