ETV Bharat / bharat

తీరు మారని తబ్లీగీలు- మాంసాహారం కోసం రగడ! - india

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగేందుకు కారణమైన తబ్లీగీ జమాత్​ సభ్యులు.. మరోసారి అసభ్యకర ప్రవర్తనతో వార్తల్లోకెక్కారు. ఐసోలేషన్​ వార్డుల్లో ఉన్న 60 మంది.. ఆసుపత్రి సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారు. ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లోని హల్లెట్​ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. కాశీరామ్​ ఆసుపత్రిలోనూ ఈ తరహా ఘటన జరిగింది.

tablighi-jamaat-members-misbehave-with-hospital-staff-in-kanpur
తీరు మారని తబ్లీగీలు- మాంసాహారం కావాలంటూ రచ్చ రచ్చ!
author img

By

Published : Apr 27, 2020, 8:54 AM IST

తబ్లీగీ జమాత్​ సభ్యులు.. తమ దురుసు ప్రవర్తనతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లోని రెండు ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారు.

కరోనా వైరస్​ నిర్ధరణ అయిన సుమారు 60 మంది తబ్లీగీలు.. స్థానిక హల్లెట్​ ఆసుపత్రి ఐసోలేషన్​ వార్డులో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మాంసాహారం కావాలంటూ ఘర్షణకు దిగారు. అంతటితో ఆగకుండా ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేసినట్లు వైద్యులు తెలిపారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

తీరు మారని తబ్లీగీలు

'' జమాత్​ సభ్యులు.. భోజనం చేసేందుకు నిరాకరించడమే కాకుండా, మాంసాహారం​ కావాలని డిమాండ్​ చేశారు. వార్డు బాయ్స్​తో అనుచితంగా ప్రవర్తించారు. ప్లేట్లు విసిరికొట్టారు. వారిపై దాడికి దిగారు.''

- డా. ఆర్తి లాల్​చందని, జీఎస్​వీఎం వైద్య కళాశాల ప్రిన్సిపల్​ అండ్​ డీన్​

గతంలోనూ తబ్లీగీ సభ్యులు వైద్యుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఉత్తర్​ప్రదేశ్​ నరేలాలో కొందరైతే ఏకంగా క్వారంటైన్​ గదుల ముందు మలవిసర్జన చేయడం వివాదాస్పదమైంది.

tablighi-jamaat-members-misbehave-with-hospital-staff-in-kanpur
ఆరోగ్య సిబ్బందితో గొడవకు దిగిన తబ్లీగీ సభ్యులు

దిల్లీ పశ్చిమ నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లీగీ జమాత్​ సంస్థ.. మార్చి ప్రారంభంలో నిర్వహించిన మతప్రార్థనా సమ్మేళనం కరోనా వైరస్​ వ్యాప్తికి కేంద్ర బిందువైంది. వివిధ రాష్ట్రాల్లో వేలమంది కరోనా బారినపడేందుకు కారణమైంది.

అక్కడ పరార్​..!

కాన్పుర్​లోని కాశీరామ్​ ఆసుపత్రిలోనూ కరోనా బాధితులు బీభత్సం సృష్టించారు. కొందరు కొవిడ్​ రోగులు ఆసుపత్రి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ తరుణంలో రెచ్చిపోయిన బాధితులు ఘర్షణకు దిగారు. ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు.

ఆసుపత్రి అద్దాలు ధ్వంసం

కాశీరామ్​ ఆసుపత్రిలో దాదాపు 65 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.