ETV Bharat / bharat

కరోనాపై పోరుకు సహకరించాలని తబ్లీగీ అధినేత పిలుపు - Markaz incident

కరోనాపై ఒక్కటిగా పోరాడాలని పిలుపునిచ్చారు తబ్లీగీ జమాతే అధ్యక్షుడు మహ్మద్ సాద్ ఖందల్వీ. లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమించి తబ్లీగీని నిర్వహించిన ఆయన.. కరోనా కష్టకాలంలో ఒకరికొకరు సహకరించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆడియో టేప్ విడుదల చేశారు.

tabligi
కరోనాపై పోరుకు తబ్లీగీ అధ్యక్షుడి పిలుపు
author img

By

Published : Apr 20, 2020, 10:42 AM IST

దేశంలో కరోనా కేసులు పెరిగేందుకు కారణమయింది తబ్లీగీ జమాతే కార్యక్రమం. ఈ ప్రత్యేక ప్రార్థనల నిర్వాహకుడు మహ్మద్ సాద్ ఖందల్వీపై పలు కేసులు నమోదు చేశారు అధికారులు. తాజాగా కరోనాపై పోరులో ప్రభుత్వానికి సహకరించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు మహ్మద్ సాద్. ఈ మేరకు ఓ ఆడియో టేపును విడుదల చేశారు.

వైరస్ బారి నుంచి బయటపడటం అత్యవసరమని, చుట్టుపక్కల ఉన్న పేదలకు సహాయం చేయాలని కోరారు సాద్. ఈ కీలక సమయంలో ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించారు.

తబ్లీగీ నేత ఆడియో టేప్

మర్కజ్​లో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించి లాక్​డౌన్ నిబంధనలను అతిక్రమించినందుకు గాను మహ్మద్ సాద్​పై ఇప్పటికే క్రైం బ్రాంచ్, ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసులు నమోదు చేశారు. త్వరలో మహ్మద్ సాద్​ను కార్యక్రమ నిర్వహణపై ప్రశ్నించనున్నారు క్రైం బ్రాంచ్ పోలీసులు. ఈ నేపథ్యంలో ఆయన సర్కారుకు సహకరించాలని పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తబ్లీగీ జమాతేపై ఎపిడెమిక్ యాక్ట్, ఐపీసీ సెక్షన్ 120బీ(నేరపూరిత కుట్ర) కింద ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి: మీ సహకారాన్ని దేశం ఎప్పటికీ మరువదు: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.