ETV Bharat / bharat

అయోధ్య తీర్పు: వివాదాస్పద భూమి హిందువులదే - అయోధ్య కేసులో సుప్రీం తీర్పు

సుప్రీం తీర్పు
author img

By

Published : Nov 9, 2019, 11:24 AM IST

Updated : Nov 9, 2019, 12:23 PM IST

12:22 November 09

అయోధ్యలో రామమందిరం...

అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమికి సంబంధించి దశాబ్దాల వివాదానికి తెరదించింది సుప్రీంకోర్టు. అత్యంత సున్నితమైన కేసులో స్పష్టమైన తీర్పు వెలువరించింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఆదేశించిన న్యాయస్థానం... వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి ట్రస్ట్​ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ ఎస్​ఏ బోబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్​ఏ నజీర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. రెవిన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద భూమి ప్రభుత్వ భూమి అని.. ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమి.. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుందని ధర్మాసనం తన తీర్పులో ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం 3 నెలల్లో కార్యాచరణను ప్రకటించి రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కేంద్రం, యూపీ సర్కార్‌ భవిష్యత్‌ కార్యాచరణను పర్యవేక్షించాలని స్పష్టం చేసింది.

ముస్లింలకు ప్రత్యామ్నాయం

వివాదాస్పద స్థలంపై.... నిర్మోహి అఖడా, షియా వక్ఫ్​ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని ఆదేశించింది. అయోధ్యలో 5 ఎకరాల స్థలాన్ని కేంద్రం లేదా ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం సున్నీ వక్ఫ్‌ బోర్డుకు కేటాయించాలని నిర్దేశించింది. 1956కు ముందు వివాదాస్పద స్థలం తమ అధీనంలో ఉందని నిరూపించేందుకు ముస్లింలు ఆధారాలు చూపలేకపోయారని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

పురావస్తు శాఖ నివేదికలు..

నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలు పరిగణనలోకి తీసుకున్నామని రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. బాబ్రీ మసీదును ఖాళీ ప్రదేశంలో కట్టలేదని స్పష్టం చేసింది. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని న్యాయస్థానం పేర్కొంది. మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందని పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందూ నిర్మాణం ఉందని పురావస్తు విభాగం చెబుతోందని న్యాయస్థానం పేర్కొంది. మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ ఎక్కడా చెప్పలేదని ధర్మాసనం వివరించింది.

అయోధ్యలోనే రాముడు..

రాముడు అయోధ్యలోనే జన్మించాడన్నది నిర్వివాదాంశమని పేర్కొంది న్యాయస్థానం. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయంలో రాముడి జన్మించాడని హిందువులు విశ్వసిస్తున్నారని పేర్కొంది. రెండు మతాలు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేసేవన్న ధర్మాసనం... రాముడు అయోధ్యలోనే పుట్టాడని ముస్లింలు కూడా అంగీకరిస్తారని వ్యాఖ్యానించింది. ఈ కేసుకు అధికరణం 47 వర్తించదని స్పష్టం చేసింది. న్యాయమూర్తి ఆదేశాలు ఉన్నప్పుడే 47వ అధికరణం వర్తిస్తుందని తేల్చి చెప్పింది.

సున్నీ వక్ఫ్ బోర్డు 12 ఏళ్ల తర్వాత వ్యాజ్యం దాఖలు చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది. మొఘులుల సమయం నుంచే హక్కు ఉన్నట్టు వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శుక్రవారం నాడు ముస్లింలు ప్రార్థనలు చేసినట్టు మాత్రమే సున్నీ వక్ఫ్‌ బోర్డు ఆధారాలు సమర్పించిందని న్యాయస్థానం తెలిపింది.

'ముస్లింలు లోపల.. హిందువులు బయట'

వివాదాస్పద స్థలంలో ముస్లింలు లోపల, హిందువులు బయట ప్రార్థనలు చేసేవారని సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి వ్యాఖ్యానించారు. 1856-57కు ముందు లోనికి వెళ్లే హక్కు హిందువులకు ఉండేది కాదన్న ధర్మాసనం ఆ సమయంలో పక్కనే ఉండే రామ్ ఛబుత్రలో హిందువులు పూజలు చేసేవారని పేర్కొంది.

1949లోనే ఆ స్థలం హిందువుల అధీనంలోకి వచ్చిందని కోర్టు వెల్లడించింది. 1949 తర్వాత ఆ స్థలం తమ అధీనంలో ఉన్నట్టు లేదా ప్రార్థనలు చేస్తున్నట్టు ముస్లింలు నిరూపించలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చుట్టుపక్కల స్థలం కూడా ముస్లింల ఆధీనంలో లేదని స్పష్టం చేసింది. వివాదాస్పద స్థలంపై తమకు ప్రత్యేక హక్కులు ఉన్నట్టు ముస్లింలు నిరూపించలేకపోయారని కోర్టు పేర్కొంది. రెండు వర్గాలు సామరస్యంగా ప్రార్థనలు చేసుకునేందుకు 1886లో వివాదాస్పద స్థలం చుట్టు రెయిలింగ్‌ ఏర్పాటు చేశారని న్యాయస్థానం పేర్కొంది.

అలహాబాద్​ కోర్టు సయోధ్య తీర్పు..

134 ఏళ్లుగా నడుస్తున్న ఈ కేసుకు సంబంధించి అలహాబాద్‌ హైకోర్టులోని లఖ్‌నవూ ధర్మాసనం 2010లో సయోధ్య కుదిర్చే తీర్పు ఇచ్చింది. వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న 2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షిదారులు.. సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్‌లల్లా సమానంగా పంచుకోవాలని స్పష్టం చేసింది.

అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ 14 పిటిషన్లు దాఖలు కాగా... 2011 మే నెలలో సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశంపై విచారణ నిర్వహించింది. తొలుత మధ్యవర్తిత్వానికి అవకాశమిచ్చినప్పటికీ.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 6 నుంచి అక్టోబర్‌16 వరకూ రోజువారీ విచారణ చేపట్టి.. తుది తీర్పును రిజర్వ్‌ చేసింది. నేడు చారిత్రక తీర్పును వెలువరించింది.

10:27 November 09

అయోధ్య తీర్పు: వివాదాస్పద భూమి హిందువులదే

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది.  అయోధ్య వివాదాస్పద స్థలం హిందూవులదేనని తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

  • 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు
  • మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు
  • స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశం
  • ఏకగ్రీవ తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తులు

New Delhi, Nov 09 (ANI): Ahead of Supreme Court's verdict in Ayodhya land case, security has been tightened in Delhi outside the Supreme Court and High Court. While speaking to ANI, Joint CP, ID Shukla said, "Delhi Police has taken appropriate security measures with the help of paramilitary, ahead of the Ayodhya verdict. There is no question of any mishappening, be it the security of Supreme Court, High Court or the security of a VIP-VVIP, it cannot be breached." The Supreme Court verdict in Ram Janmbhoomi-Babri Masjid title suit is set to be announced today.

Last Updated : Nov 9, 2019, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.