దంత వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 7 వేల సీట్లు భర్తీకి ఈ నెల 18 వరకు గడువు పొడిగించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. జనవరి 31తో పాత గడువు తేదీ ముగిసిన నేపథ్యంలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అర్హత మార్కులు తగ్గింపు, గడువు అంశాలపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది ధర్మాసనం. ప్రతిభ ఆధారంగా సీట్ల భర్తీ జరగాలని పేర్కొన్న సుప్రీంకోర్టు.. అర్హత మార్కుల శాతం తగ్గించాలని తెలిపింది. ఈ మేరకు జనరల్ కేటగిరీలో 10 శాతం, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం తగ్గించాలని తెలిపింది.
అర్హత మార్కుల శాతం ఎక్కువగా ఉండటం వల్లే డెంటల్ కళాశాలల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని ఏపీ డెంటల్ కళాశాల అసోసియేషన్ సహా పలు రాష్ట్రాల ప్రవేటు కాలేజీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
ఇదీ చూడండి: భాజపా నేతపై సిరా దాడి- నిందితులు అరెస్టు