రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టు కోసం ఉద్దేశించిన భూమిని అక్రమంగా డీనోటిఫికేషన్ చేసిన కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఇదే కేసులో మరో 15 మంది ప్రజాప్రతినిధులకూ సమన్లు జారీ చేసింది న్యాయస్థానం. వీరంతా అక్టోబర్ 4న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.
హలాగే వాడెరహల్లి గ్రామంలో బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీకి చెందిన 3 ఎకరాల 34 గుంటల భూమిలో బనశంకరి ఐదో దశ లేఅవుట్ అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ భూమిని అక్రమంగా డీనోటిఫికేషన్ చేసినట్లు అభియోగం నమోదైంది.
2007లో ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడానికి ముందే కుమారస్వామి బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) భూమిని అక్రమంగా డీనోటిఫై చేశారని పిటిషనర్ మహాదేవస్వామి ఆరోపించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ మేరకు లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానం కుమారస్వామికి సమన్లు జారీచేసింది.
ఇదీ చూడండి: కశ్మీర్లో అంతర్గత యుద్ధానికి పాక్ కుట్ర!