ETV Bharat / bharat

'శాంతిభద్రతలపై స్పష్టత కావాలంటే నన్ను పిలవండి' - Punjab law and order news

పంజాబ్​లో శాంతిభద్రతల విషయంపై ప్రశ్నించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆ రాష్ట్ర గవర్నర్​ పిలిచారు. ఈ వ్యవహారంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్​ మండిపడ్డారు. హోంమంత్రిగా ఉన్న తనను నివేదిక కోరకుండా తన అధికారులను పిలవడమేంటని ప్రశ్నించారు.

Summon me for any clarification on law and order: Punjab CM to Governor
'శాంతిభద్రతలపై స్పష్టత కావాలంటే నన్ను పిలవండి'
author img

By

Published : Jan 3, 2021, 6:01 AM IST

పంజాబ్​లో శాంతి భద్రతల పరిస్థితిపై హోంమంత్రిగా కూడా ఉన్న తనను నివేదిక కోరకుండా గవర్నర్​ ఉన్నతాధికారులను పిలవడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్​సింగ్​ తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. భాజపా చిల్ల చేష్టలకు గవర్నర్​ తలవంచడం దురదృష్టకరమని విమర్శించారు.

రాష్ట్రంలో మొబైల్​ టవర్ల విధ్వంసం వంటి చెదురుమదురు ఘటనల నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యపై ప్రశ్నించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను గవర్నర్​ వీపీ సింగ్​ బద్నౌర్​ పిలవడంతో ముఖ్యమంత్రి స్పందించారు. వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళన పరిణామాల నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పంజాబ్​ శాంతిభద్రతల పరిస్థితులు దిగజారాయని దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఒకవేళ శాంతిభద్రతల పరిస్థితిపై గవర్నర్​ నిజంగ ఆందోళన ఉంటే హోం మంత్రిత్వశాఖను కూడా చూస్తున్న తనతో చర్చించాలని అమరీందర్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ 'పోల్ ప్యానెళ్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.