ETV Bharat / bharat

భాజపాలో చేరే దిశగా సుమలత అడుగులు..! - BJP

మండ్య లోక్​సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన సుమలత భాజపా నేతలు ఎస్​ఎం క్రష్ణ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సుమలత భాజపాలో చేరనున్నారనే వార్తలు జోరందుకున్నాయి.

భాజపాలో చేరే దిశగా సుమలత అడుగులు?
author img

By

Published : May 26, 2019, 6:51 PM IST

కర్ణాటకలోని మండ్య లోక్​సభ స్థానం నుంచి పోటీ చేసి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు సుమలత. గెలుపు అనంతరం తనకు సహకరించిన పలువురిని కలిసి ధన్యవాదాలు తెలుపుతున్నారామె. తాజాగా భాజపా నేత ఎస్​ఎం క్రష్ణతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను కలిశారు. ఈ నేపథ్యంలో సుమలత భాజపాలో చేరతారనే వార్తలకు మరింత ఊతమొచ్చింది.

విలేకర్లతో మాట్లాడుతోన్న సుమలత

" నేను ఇంతవరకు నా విజయాన్ని సెలబ్రేట్​ చేసుకోలేదు. మండ్యకు వెళ్లి అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలి. మే 29, నా భర్త జన్మదినం సందర్భంగా మండ్యకు వెళ్తాను. నా విజయం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ఈ కీర్తి వర్తిస్తుంది. ఇప్పటి వరకు దేశంలో జరిగిన అత్యంత క్లిష్టమైన ఎన్నికలు ఇవేనేమో. చాలా మంది నాకు కనీసం అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో 222 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. వారందరిలో కేవలం ఒక్కరే విజయం సాధించారు. అది నేనే కావడం చాలా సంతోషం."
- సుమలత, మండ్య ఎంపీ

భాజపా గెలుపుపై హర్షం

దేశ ప్రజలు భాజపాకు సంపూర్ణ మెజారిటీ అందించడంపై ఆనందం వ్యక్తం చేశారు సుమలత. ప్రజలు ఒకే పార్టీకి అఖండ విజయం అందించారని... ఇలాంటి ప్రజాతీర్పు ఎంతో ఉపయోగకరమైందని అభిప్రాయపడ్డారు. ఏదైనా పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పుడే వారు అనుకున్న అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయగలరని ఆశిస్తున్నానన్నారు. భాజపాపై సానుకూల ప్రకటనలు చేసిన నేపథ్యంలో సుమలత త్వరలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారని అంతా భావిస్తున్నారు.

అబ్బే అలాంటిదేం లేదు..

భాజపాలో చేరతారనే ఊహాగానాలపై స్పందించారు మండ్య లోక్​సభ సభ్యురాలు సుమలత. ఓ స్వతంత్ర అభ్యర్థి ఏదో ఒక రాజకీయపార్టీలో చేరాలన్న నియమమేమీ లేదన్నారు. కేవలం ప్రజా సమస్యలపై పోరాడే క్రమంలో ఇతర పార్టీల సిద్ధాంతాలు నచ్చితే వాటికి మద్దతు మాత్రమే ఇవ్వగలమన్నారు. అంతే తప్ప పార్టీలో చేరలేమని స్పష్టం చేశారు. తనకు విజయాన్ని అందించిన మండ్య ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

సుమలత అలాంటిదేం లేదని చెప్తున్నా త్వరలోనే భాజపాలో చేరతారని సమాచారం.

ఇదీ చూడండి: 'కొత్త ఎంపీల్లో 43 శాతం మంది నేరచరితులే'

AP Video Delivery Log - 1000 GMT News
Sunday, 26 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0955: Lithuania Presidential Election No access Lithuania 4212661
Second round of Lithuanian presidential elections
AP-APTN-0951: Italy EU Voting AP Clients Only 4212660
Polls open in tense EU elections in Italy
AP-APTN-0948: Germany Weber Voting AP Clients Only 4212659
Centre-right EPP's Weber votes in EU elections
AP-APTN-0913: France Le Pen Voting AP Clients Only 4212655
Far-right leader Le Pen votes in France
AP-APTN-0908: Greece Tsipras Voting No access Greece 4212654
Greek PM Tsipras votes in EU elections
AP-APTN-0906: Bulgaria EU Voting AP Clients Only 4212653
Pro-EU vote expected in Bulgaria
AP-APTN-0904: France Loiseau Voting AP Clients Only 4212652
Macron's top candidate, Loiseau, votes
AP-APTN-0850: Spain Sanchez Voting AP Clients Only 4212650
Spanish caretaker PM Sanchez votes in EU elections
AP-APTN-0832: OBIT Prem Tinsulanonda Part no access Thailand 4212651
Thai former PM Tinsulanonda dead at 98
AP-APTN-0800: PNG PM Resigns No access Australia 4212649
PNG PM O'Neill resigns after 7 years
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.