ETV Bharat / bharat

ఆ యాంకర్​పై కేసుల కొట్టివేతకు సుప్రీం విముఖత - ఆర్ పార్​

సూఫీ సాదువు క్వాజా మొయినుద్దీన్​ చిస్తీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన యాంకర్ అమిష్ దేవగన్​పై నమోదైన కేసుల్ని కొట్టివేయాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే ఈ కేసుల్లో పోలీసులు ఎలాంటి బలవంతపు చర్య తీసుకోకుడా రక్షణ కల్పిస్తామని పేర్కొంది.

sufi saint quazi moinuddin chisti case hold by supreme court
ఆ యాంకర్​పై కేసుల కొట్టివేతకు సుప్రీం విముఖత
author img

By

Published : Dec 8, 2020, 8:04 AM IST

ప్రఖ్యాత సూఫీ సాధువు క్వాజా మొయినుద్దీన్​ చిస్తీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన యాంకర్​పై నమోదైన కేసుల్ని కొట్టివేయాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. 'ఆర్​ పార్​'పేరిట ఓ టీవీ ఛానల్​లో ప్రసారం అయ్యే షోలో జూన్​ 15న వ్యాఖ్యాత అమిష్​ దేవగన్​ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అతనిపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. షోలో చర్చ సమయంలో అల్లావుద్దీన్​ ఖిల్జీని బందిపోటుగా పేర్కొనే సందర్భంలో అనుకోకుండా చిస్తీ పేరు ప్రస్తావించానని, ఆ తర్వాత తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పానని అమిష్​ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు అతనిపై నమోదైన కేసులు కొట్టివేసేందుకు నిరాకరించింది. అయితే ఈ కేసుల్లో పోలీసులు ఎలాంటి బలవంతపు చర్య తీసుకోకుడా రక్షణ కల్పిస్తామని పేర్కొంది. సమాజంపై ప్రభావం చూపగలిగే వ్యక్తులు.. వాక్​ స్వాతంత్ర్యాన్ని వినియోగించుకోవటంలో మరింత బాధ్యతాయుతంగా ఉండాలంది. ఉద్దేశాలను వ్యక్తపరిచే విషయంలో ఉపయోగించే పదాలు జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలని సూచించింది.

రిపబ్లిక్​ ఛానల్​ ఉద్యోగుల పిటిషన్​ తిరస్కరణ

రిపబ్లిక్​ ఛానల్​, దాన్ని నిర్వహించే ఏఆర్​జీ మీడియా గ్రూపుపై మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో ఉద్యోగుల్ని అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఛానల్​లోని ఏ ఉద్యోగినీ అరెస్టు చేయకుండా కోరడం, అలాగే ఈ కేసుల్ని సీబీఐకి బదిలీ చేయాలనడం, అత్యాశగా ఉన్నాయని జస్టీస్​ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్​ పేర్కొంది.

ఇదీ చదవండి : '1975 ఎమర్జెన్సీ'పై సుప్రీంలో 94 ఏళ్ల వృద్ధురాలి పిటిషన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.