ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రతిష్టాత్మక ఇటాలియన్ గోల్డెన్ సాండ్ ఆర్ట్ అవార్డు 2019కు ఎంపికయ్యారు. ఇటలీలో నిర్వహించనున్న అంతర్జాతీయ సాండ్ నేటివిటీ కార్యక్రమంలో సుదర్శన్ ఈ పురస్కారం అందుకోనున్నారు.
నవంబరు 13 నుంచి 18 వరకు ఈ వేడుక జరగనుంది. ఎనిమిది మంది శిల్పులు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో పట్నాయక్ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ అవార్డుకు ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉందని పట్నాయక్ తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ట్విట్టర్ వేదికగా సుదర్శన్‌కు అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి : 'మహారాష్ట్రలో నవంబర్ 7 తరువాత రాష్ట్రపతి పాలన!'