దిల్లీ జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నిరసన ర్యాలీలు చేపట్టాయి.
హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీడీఎస్‌యూ నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ముంబయిలో గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వీరికి నటుడు సుశాంత్ సింగ్ మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొన్నారు. దిల్లీలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
బెంగళూరు టౌన్‌హాల్ ఎదుట పోస్టర్లను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు విద్యార్థులు. కోల్‌కతా జాదవ్‌పుర్ విశ్వవిద్యాలయంలోనూ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.
భారత విద్యార్థి సమాఖ్య(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో కోల్‌కతా, చండీగఢ్‌లో నిరసన ర్యాలీలు చేపట్టారు.