ETV Bharat / bharat

కేన్సర్​ బాధితుల్లోనే గుండెపోటుకు అవకాశాలు ఎక్కువ - క్యాన్సర్​

గుండెపోటు వచ్చే అవకాశాలు కేన్సర్​ బాధితుల్లోనే అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్​ విశ్వవిద్యాలయం పరిశోధకులు. సామాన్య ప్రజలతో పోల్చితే వీరికి గుండెపోటు వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. రొమ్ము, పెద్ద పేగు భాగాలకు కేన్సర్​​ సోకిన వారిలో ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.

క్యాన్సర్​ బాధితుల్లో గుండెపోటుకు అవకాశాలు ఎక్కువ
author img

By

Published : Nov 23, 2019, 10:01 AM IST

సామాన్య ప్రజలతో పోల్చితే.. కేన్సర్​​తో బాధపడుతున్న వారు, ఇంకా ఆ వ్యాధి నుంచి బయటపడిన వారిలోనే రెండు రెట్లు అధిక శాతం గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఓ నివేదిక తేల్చింది. భయంకర కేన్సర్​​ వ్యాధితో బాధపడుతున్న సుమారు 7 మిలియన్ల మందిపై సర్వే చేసి ఈ నివేదిక తయారు చేసింది. అమెరికాకు చెందిన నేషనల్​ కేన్సర్​ ఇన్​స్టిట్యూట్​ సర్వైలెన్స్​, ఎపిడెమియోలజీ, ఎండ్​ రిజల్ట్స్​ (ఎస్​ఈఈఆర్​) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ సర్వే చేపట్టారు. ఈ నివేదికను అమెరికా జర్నల్​ 'నేచర్​ కమ్యూనికేషన్'​ వార్తా సంస్థ ప్రచురించింది.

ఎస్​ఈఈఆర్​ వద్ద 1992-2015 మధ్య కేన్సర్​ వ్యాధి బారిన పడిన సుమారు 7.2 మిలియన్ల మంది బాధితుల వివరాలు సేకరించారు పరిశోధకులు. రొమ్ము, పెద్ద పేగు భాగాలకు కేన్సర్ సోకిన వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు.

"గతంలోని పరిశోధనల ఆధారంగా కేన్సర్​ బాధితులు ఆ వ్యాధితో మరణించటం లేదు. దానికి మరేదో కారణం ఉంది. ఇందుకు గుండెపోటు ఒక కారణం. గుండెపోటు ద్వారా సంభవించే మరణాల నుంచి కాపాడుకునేందుకు మా పరిశోధనలు ఉపయోగపడతాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారిని గుర్తించేందుకు సులభమవుతుంది. పరిశోధన చేసిన 7.5 మిలియన్ల మంది​ కేన్సర్​ రోగుల్లో 80 వేల మందికిపైగా గుండెపోటుతోనే మరణించారు. స్త్రీ, పురుషుల్లో సమానంగా స్ట్రోక్స్​ వచ్చే అవకాశాలు ఉన్నాయి. "

- నికోలస్​ జోర్స్కీ, పరిశోధకుడు, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం.

చిన్న వయసులో కేన్సర్​ బారిన పడిన వారిలో స్ట్రోక్​ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని పేర్కొంది నివేదిక. 40 ఏళ్లలోపు వారిలో ఎక్కువ శాతం మెదడులో కణితులు, లింఫోమాస్​కు చికిత్స పొందుతున్న వారిలోనే ఎక్కువ స్ట్రోక్స్​ నమోదైనట్లు తెలిపింది. క్యాన్సర్​ బాధితుల్లో రక్తం గడ్డకట్టి, ఊపిరితిత్తులు, మెదడులోకి వెళ్లి గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

9.6 మిలియన్ల మంది మృతి..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) విడుదల చేసిన సమాచారం ప్రకారం 2018లో సుమారు 9.6 మిలియన్ల మంది కేన్సర్​తో మరణించారు. ఇందులో సుమారు 5 లక్షల మంది గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోయినట్లు 'ద లాన్సెరట్'​​ జర్నల్​ పేర్కొంది.

ఇదీ చూడండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్​ ఠాక్రే: పవార్​

Lahaul-Spiti (Himachal Pradesh), Nov 22 (ANI): Himachal Pradesh's Lahaul-Spiti received fresh snowfall on November 22. Koksar region received snowfall today. Normal lives also got affected. The temperature of Koksar is 3 degree Celsius as of today.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.