భారత కబడ్డీ జట్టు కెప్టెన్ అజయ్ ఠాకూర్ 'ఈటీవీ భారత్' యాప్‌ను ప్రశంసించాడు. 'ఒకే దేశం-ఒకే యాప్' నినాదంతో 13 ప్రధాన భారతీయ భాషల్లో నాణ్యమైన వార్తలను అందిస్తోన్న ఈటీవీ భారత్‌ను తన అభిమానులు, ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు.
"స్నేహితులారా! ఈటీవీ భారత్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్‌లో 13 భారతీయ భాషల్లో తాజా వార్తలు అందిస్తున్నారు. అందరూ ఈ యాప్ ద్వారా నాణ్యమైన తాజా వార్తలను చూసి ఆస్వాదించండి."- అజయ్ ఠాకూర్, భారత కబడ్డీ జట్టు కెప్టెన్
ఇటీవల బిలాస్‌పుర్‌లో పర్యటించిన అజయ్ ఠాకూర్... స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రానికి వెళ్లారు. అక్కడ తాను గడిపిన పాతరోజులను నెమరువేసుకున్నారు. తన ఆటతో దేశ కబడ్డీ క్రీడను మరోస్థాయికి తీసుకువెళ్లాడు ఈ స్టార్ కబడ్డీ ప్లేయర్. ఈ సందర్భంగా ఈటీవీ భారత్ గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
ఇదీ చూడండి: 'మహా'పోరు: ఓట్ల పండుగకు సర్వం సిద్ధం