జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అదే సమయంలో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు.
తొలుత... పాంత చౌక్ వద్ద ఉన్న పోలీసులు-సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు.. ఘటనాస్థలంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు మరోమారు కాల్పులకు తెగబడగా.. ఈ పూర్తి వ్యవహారం ఎన్‌కౌంటర్‌కు దారితీసింది.
ఇదీ చూడండి:- ఆగ్రా బస్ హైజాక్ ప్రధాన నిందితుడు అరెస్ట్