ETV Bharat / bharat

రామాయణ ధర్మాన్ని ప్రపంచానికి చాటిచెప్పండి: వెంకయ్య

author img

By

Published : Aug 2, 2020, 6:02 PM IST

మహాకావ్యం రామాయణంలోని ధర్మాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ప్రపంచం మొత్తానికి ఆ సందేశాన్ని వ్యాప్తి చేయాలని కోరారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆగస్టు 5న అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభం అవుతుండటంపై హర్షం వ్యక్తం చేశారు. రామాయణం, శ్రీరాముని గొప్పతనాన్ని తెలియజేస్తూ ఫేస్​బుక్​లో వ్యాసం​ పోస్ట్ చేశారు.

Spread the universal message of 'dharma' as depicted in Ramayana: VP Naidu
రామాయణ ధర్మాన్ని ప్రపంచానికి చాటిచెప్పండి: వెంకయ్య

అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆగస్టు 5న ప్రారంభమవుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మందిర పునర్నిర్మాణం విలువలకు గుడి కట్టడం లాంటిదని అభివర్ణించారు. రామాయణంలోని ధర్మాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. ఆ సందేశం ప్రపంచం మొత్తానికి వ్యాప్తి చేయాలని పిలుపునిచ్చారు.

"మరో రెండు రోజుల్లో మన మహోజ్వలమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఒక చారిత్రక ఘట్టం మన కళ్ల ముందు ఆవిష్కారం కాబోతుంది. కనీసం 2వేల సంవత్సరాల క్రితం రచించిన, మన సామూహిక చేతనలో భాగమై అమర కావ్యంగా ప్రసిద్ధి గాంచిన రామాయణంతో మనకున్న అనుబంధం ప్రతిఫలించబోతుంది. శ్రీరాముడు మనకు ఆదర్శవంతమైన, అసాధారణమైన, కోట్లాది మంది దేవుడుగా ఆరాధించే ఒక మహాపురుషుడు. అంతేకాదు, ఒక న్యాయపూరితమైన, బాధ్యతాయుతమైన సామాజిక వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు విలువలకోసం తన జీవితాన్ని పణంగా పెట్టిన మహానుభావుడు. ఆ రాముడికోసం మనం ఒక దేవాలయాన్ని నిర్మించడం రోమాంచితంగా, మన జీవితాలు ధన్యమైనట్లుగా అనిపించడంలో ఆశ్చర్యమేముంది? ఇవాళ గత వైభవం మన కళ్లముందే ఒక మహాద్భుతంగా ప్రత్యక్షం కాబోతుంది. మనం కలలు కంటున్న ఆకాంక్షలు సజీవం రూపం దాల్చబోతున్నాయి. నిజంగా ఈ ఘట్టం మనలో అప్రయత్నంగా ఉత్సవ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. మనం రామాయణ సారాన్ని సరైన దృక్పథంతో అవగాహన చేసుకుంటే, ధర్మం పట్ల, నైతిక వర్తన పట్ల విశిష్టమైన భారతీయ దృక్పథాన్ని ఒడిసిపట్టుకున్న ఒక కావ్యంగా మనం అవలోకిస్తే, ఇదొక సాధారణ పరిణామంగా అనిపించదు. మొత్తం సమాజంలో ఒక నవనవోన్మేషమైన ఆధ్యాత్మిక ఉత్తేజానికి దారితీసే పరిణామమని మనకు అర్థం అవుతుంది. రామాయణం ఒక విశ్వజనీన దృష్టిని ప్రసరించే మహాకావ్యం కాబట్టే అది ఆగ్నేయాసియా లో అనేక దేశాల సంస్కృతిపై బలమైన ప్రభావాన్ని చూపింది.

వేద పారంగతుడు, సంస్కృత పండితుడు అయిన ఆర్థర్ ఆంథోనీ మెక్ డోనెల్ ప్రకారం భారతీయ ప్రతుల్లో వర్ణించిన శ్రీరాముడి ఆదర్శాలు మౌలికంగా లౌకికమైనవి. గత రెండున్నర సహస్రాలుగా ప్రజల జీవితాలు, ఆలోచనలపై అవి ప్రగాఢ ప్రభావాన్ని చూపుతున్నాయి. భారత దేశంలోనే కాదు, ఆగ్నేయాసియాలో జావా, బాలి, మలయా, బర్మా, థాయిలాండ్, కంబోడియా, లావోస్ మొదలైన అనేక దేశాల్లో రామాయణం ఎందరో కవులు, నాటక రచయితలు, నృత్యకళాకారులు, సంగీతకారులు, జానపద కళాకారులను ఆకట్టుకుంది.

బుద్ధిజం, జైనిజం, సిక్కిజం వంటి ఇతర మతాల్లో కూడా రామాయణాన్ని ఏదో రూపంలో అన్వయించుకోవడం ఆసక్తికరం. ఎన్నో భాషల్లో ఎన్నో రకాలుగా రామాయణ కావ్యాన్ని కథలు కథలుగా చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఈ మహాకావ్య ఇతివృత్తం, వృత్తాంతం లోనే విభిన్నమైన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే శక్తి ఇమిడి ఉంది. ‘పర్వతాలు దృఢంగా ఉన్నతంగా నిలిచినంతవరకూ, నదుల్లో నీరు ప్రవహిస్తున్నంతవరకూ రామాయణ గాథ ప్రజలను సమ్మోహనపరుస్తూనే ఉంటుంది’ అని నారద మహాముని ఆనాడే కాలజ్ఞానంతో చేసిన వ్యాఖ్యలు సత్యవాక్కులుగా స్థిరపడిపోయాయి. సీత, లక్ష్మణులతో కలిసి ఉత్తరాదిన అయోధ్య నుంచి దక్షిణాదిన శ్రీలంక వరకూ శ్రీరాముడు జరిపే సుదీర్ఘ యాత్రలో జరిగే అనేక ఘట్టాల చుట్టూ ఈ మహాకావ్యంలో అడుగడుగునా విలువలతో కూడిన వ్యవస్థ పెనవెసుకున్నట్లు మనకు తెలుస్తుంది. అదే దాని విశిష్టత అని చెప్పక తప్పదు. ‘సచ్ఛీలుడైన, నిష్కళంకుడైన, మచ్చలేని ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం కల, సకల విద్యలు నేర్చిన, సమర్థుడైన, అన్ని ప్రాణుల సంక్షేమం గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా?’ అని కవి వాల్మీకి నారద మహామునిని ప్రశ్నించడంతో రామాయణ మహాకావ్యం ప్రారంభమవుతుంది. ఇలాంటి అన్ని ఆదర్శ లక్షణాలున్న వ్యక్తిని కనుగొనడం కష్టమేనని, అయితే ఈ లక్షణాలకు సరిపోయే ఒక వ్యక్తి ఉన్నారని నారదుడు వివరిస్తాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, రాముడని వెల్లడిస్తాడు. .

ఆగస్టు 5, 2020న అయోధ్యలో ప్రజలు ఆకాంక్షిస్తున్న భవ్యమైన ప్రాచీన మందిర నిర్మాణాన్ని ప్రారంభించే ఈ పవిత్రమైన సందర్భంలో ఉత్కృష్టమైన రామాయణ మహాకావ్యాన్ని అర్థం చేసుకుని దాని సార్వత్రిక, విశ్వజనీనమైన సందేశాన్ని వ్యాప్తి చేయడం, అది చాటిచెప్పే ఉన్నతమైన మౌలిక విలువల ఆధారంగా మన జీవితాలను సుసంపన్నం చేసుకోవడం శ్రేయస్కరం. అందరం తొలి భారతీయ ఇతిహాసమైన శ్రీమద్రామాయణ మహా గ్రంథం చదివి, ఆకళింపు చేసుకుందాం. అందులోని భారతీయ తత్వాన్ని అర్థం చేసుకుని మన సంస్కృతి, సంప్రదాయాల్లోని గొప్పతనాన్ని అవగతం చేసుకుని, ఆచరిద్దాం. అందులోని మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం."

-వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి.

ఇదీ చూడండి: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.