అసోం గువాహటిలో స్పైస్‌జెట్ విమానానికి ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై నిర్దేశించిన మార్క్ కంటే ముందుకు దూసుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికుల్లో ఎవరికీ గాయాలు కాలేదని.. సురక్షితంగా బయటపడినట్లు పేర్కొన్నారు.
బెంగళూరు నుంచి గువాహటికి వస్తోన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ల్యాండింగ్ సమయంలో రన్‌వే పై ఉండే లైట్లు దెబ్బతినడం కారణంగా ఇలా జరిగిందన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారో తెలియాల్సి ఉంది. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.