ETV Bharat / bharat

బంపర్ ఆఫర్​ : దిల్లీకి వెళ్లేవారికి స్పైస్​జెట్ ఉచిత టికెట్లు! - telugu national news

దిల్లీలో జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు దూర ప్రయాణాలు చేయాలా?.. అందుకు ఎక్కువ ఖర్చవుతుందని భావిస్తున్నారు కదూ! మీలాంటి వారి కోసమే స్పైస్​జెట్​ బంపర్ ఆఫర్​ తీసుకొచ్చింది. ఓటు​ వేసేందుకు వేళ్లేవారికి ఉచితంగా టికెట్లు ఇవ్వనుంది.

SpiceJet offers 'free tickets' to flyers who are travelling to Delhi for voting on Feb 8
దిల్లీలో ఓటు వేసేవారికి స్పైస్​ జెట్​లో​ ఉచిత ప్రయాణం
author img

By

Published : Feb 4, 2020, 6:01 AM IST

Updated : Feb 29, 2020, 2:22 AM IST

దిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దూర ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు దేశరాజధానికి వెళ్లాలనుకునే వారికి శుభవార్త. ఓటింగ్ సమయంలో ఇతర ప్రాంతాల్లో ఉంటూ దిల్లీకి ప్రయాణించే వారికోసం స్పైస్​జెట్ ఉచిత టికెట్లను అందించనున్నట్లు తెలిపింది. కనీస ఛార్జీల పన్నులు, సర్​ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
సంస్థకు చెందిన వెబ్​సైట్​లో ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ చేసుకున్న తర్వాత.. ఎయిర్​లైన్స్ అంతర్గత ప్యానెల్​ ప్రయాణికులను షార్ట్​లిస్ట్​ పద్దతి ద్వారా ఎంపిక చేస్తారు.

ఒకేరోజు అయితే.. రెండు టికెట్లు

'స్పైస్​ డెమోక్రసీ' పేరుతో ఇస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్లలో.. ఫిబ్రవరి 8న దిల్లీకి బయలుదేరి మళ్లీ అదే రోజు తిరుగు ప్రయాణం చేస్తే రెండు టికెట్లపై మొత్తం బేస్​ ఛార్జీలను తిరిగి చెల్లించనున్నట్లు పేర్కొంది. అలా కాకుండా 7వ తేదీ వెళ్లి 8న తిరిగి వస్తే.. 8వ తేదీ ఒక్కరోజుకు మాత్రమే ఉచిత టికెట్​ అందిస్తుంది. ఓటింగ్​ రోజైన 8వ తేదీ వెళ్లి 9న వస్తే.. ఈ సందర్భంలోనూ 8వ తేదీకి మాత్రమే ఉచితమని ప్రకటించింది.

ఫిబ్రవరి 5 వరకు రిజిస్ట్రేషన్​

ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5 వరకు ​ అందుబాటులో ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఎంపిక చేసిన వారికి ఫిబ్రవరి 6న సమాచారం ఇస్తారు.

సెల్ఫీ పెట్టాలి సుమా..

స్పైస్ జెట్​ ద్వారా దిల్లీకి వెళ్లి ఓటు వేసిన వారు.. ఓటు వేసిన సిరా గుర్తు వేలితో కూడిన సెల్ఫీని.. స్పైస్​ డెమోక్రసీ హ్యాష్​ట్యాగ్​తో ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​, ట్విట్టర్​లో అప్​లోడ్ చేయాలని సంస్థ అధికారులు వెల్లడించారు.

Intro:Body:

Amazing Himachal: Evil powers are vanquished by obscene abuses!

Conclusion:
Last Updated : Feb 29, 2020, 2:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.