ETV Bharat / bharat

మగువలు మెచ్చే.. వన్నెతగ్గని 'లక్కగాజులు' - లక్కగాజుల ప్రత్యేకతలు

మహిళ చేతికి గాజులుంటే ఆ కళే వేరు. అలా అందమైన, రంగురంగుల గాజులు భారతీయ సంస్కృతిలో భాగమైనవే. ఇక లక్కతో తయారైన గాజులకు మహిళలు, యువతులు అతిగా ఆకర్షితులవుతారు. అంతటి ఘనత కలిగిన ఈ లక్కగాజుల కళాకారులకు.. జైపుర్​లో జరిగే ప్రఖ్యాత 'భారత్​రంగ్' కార్యక్రమం నుంచి పిలుపు అందింది.

LACQUERED BANGLERS
మహాభారతాన్ని స్ఫురించే వన్నెతగ్గని 'లక్కగాజులు'
author img

By

Published : Dec 24, 2020, 3:17 PM IST

మహాభారతాన్ని గుర్తుకుతెచ్చే వన్నెతగ్గని 'లక్కగాజులు'

ప్రతి ఇంటా మహిళలు చేతికి రంగురంగుల గాజులు వేసుకుని.. ఇంటిపని, వంటపనీ చేసేటప్పుడు వచ్చే గాజుల శబ్దం మధురంగా ఉంటుంది. ఎరుపు, పసుపుపచ్చ, ఆకుపచ్చ సహా.. అన్ని రంగుల గాజులు భారతీయ సంస్కృతిలో భాగమే. ప్రత్యేకించి, లక్కతో తయారైన గాజులకు మహిళలు, యువతుల నుంచి భారీ డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ లక్కగాజులు తయారుచేసే కళాకారులకు భారత్​రంగ్​ మహోత్సవ్ కార్యక్రమానికి ఆహ్వనమందింది. జైపుర్​​లోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.

"లక్కకు పెద్ద చరిత్రే ఉంది. మన సంస్కృతిలోనూ దానికి ప్రత్యేక స్థానముంది. పాండవుల కోసం కౌరవులు నిర్మించిన లక్షగృహం లక్కతోనే నిర్మించారు. మహాభారతంలోనూ అంతటి ప్రత్యేకత ఉన్న లక్కతో తయారైన గాజులు చాలా ప్రసిద్ధి పొందాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు."

- పూనమ్ నౌరియా, రిపోర్టర్

ఇదీ చదవండి: భూలోక స్వర్గాన్ని తలపించే అద్దాల మేడ

మహాభారతం స్ఫురణ..

లక్కతో గాజులు తయారుచేయడం తమ కుటుంబ వ్యాపారమనీ.. 32ఏళ్లుగా గాజుల తయారీలోనే నిమగ్నమయ్యానని చెప్తున్నాడు జైపూర్​కు చెందిన కళాకారుడు మొహమ్మద్ అసీఫ్. లక్క గురించి మాట్లాడితే, మహాభారతం స్ఫురణకు వస్తుంది. పాండవులను చంపేందుకు లక్కతో నిర్మించిన లక్షగృహానికి కౌరవులు నిప్పంటిస్తారు.

"మహాభారతంలో దుర్యోధనుడు పాండవులను చంపడానికి ఓ మహల్​ను నిర్మిస్తాడు. అతీత శక్తిని ఉపయోగించి ఆయన సురక్షితంగా బయటపడతాడు. పండగల సమయాల్లో మేం మా కళను ప్రదర్శిస్తాం. జనాలు మెచ్చుకుంటారు."

- మొహమ్మద్ అసీఫ్, కళాకారుడు

వన్నె తగ్గని గాజులు..

గాజు లేదా ప్లాస్టిక్​తో తయారయే గాజులు.. కొద్దిరోజులు వేసుకున్న తర్వాత మెరుపు కోల్పోతాయి. కానీ, లక్కతో తయారైన గాజులు మాత్రం పగిలిపోయేంతవరకూ వన్నె కోల్పోవు. అందుకే ఎక్కువ మంది మహిళలు ఇప్పటికీ వీటిని ధరించేందుకు ఇష్టపడతారు.

"లక్క గాజులు ప్రత్యేకమైనవి. ఓ ప్రత్యేక గుర్తింపు వాటికుంటుంది. గాజుతో తయారైన గాజులు వేసుకుంటే కొద్ది రోజులకు మెరుపును కోల్పోతాయి, కానీ, లక్క గాజులు ఎప్పటికీ అలా అవవు. యువతులైనా, మహిళలైనా ఈ గాజులు వేసుకుంటే అందంగా కనిపిస్తారు."

- అనితా బాలి, వినియోగదారు

లక్కను ఉపయోగించి వివిధ రకాల గాజులు తయారుచేస్తున్నారు కళాకారులు. ఈ గాజులను కొనేవారూ పెద్దసంఖ్యలోనే ఉన్నారు. ఈ కళను నమ్ముకున్న కళాకారులు, వ్యాపారుల ఆదాయానికి ఢోకా లేదనే చెప్పుకోవాలి.

ఇదీ చదవండి: కళ కోల్పోతున్న చారిత్రక 'కిలా ముబారక్​'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.