కర్ణాటక చిత్రదుర్గ జిల్లాకు చెందిన సాగర్ అనే నిరుద్యోగి వినూత్నంగా ఆలోచించి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పెంపుడు కుక్కలకోసం ఓ ప్రత్యేక వసతి గృహాన్ని ఏర్పాటు చేసి అదే వృత్తిగా కొనసాగిస్తున్నారు. రూ.లక్ష ఖర్చు చేసి చిత్రదుర్గ జిల్లా చల్లకేరి రోడ్‌లోని మహేశ్వరి ఎస్టేట్స్‌లో వసతి గృహాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం ఇక్కడ 13 శునకాలు ఉన్నాయి.
బాధ నుంచే భలే ఐడియా
సాగర్‌కు ఈ ఆలోచన రావటానికి కారణం తను ప్రేమగా చూసుకున్న శునకాన్ని కోల్పోవటమే. ఉద్యోగం కోసం సాగర్..తన పెంపుడు కుక్కను ఒంటరిగా వదిలి వెళ్లాల్సి వచ్చింది. తనలాగా ఎవ్వరూ తమ పెంపుడు కుక్కలను వదిలివేయకూడదని నిర్ణయించుకున్నారు.
ఇంట్లో ఉన్నట్లే..
శునకాలకు ఇంట్లో యజమానులు ఏ ఆహారం ఇస్తే వసతి గృహంలోనూ అదే ఆహారం ఇస్తారు. సమయానికి ఆహారం, స్నాక్స్ అందిస్తారు. రోజూ వ్యాయామం చేయిస్తారు. రోజూ ఉదయం, సాయంత్రం కుక్కలను నడకకు తీసుకెళ్తారు. శునకాలు అనారోగ్యం బారిన పడకుండా వైద్యులను కూడా అందుబాటులో ఉంచారు.
ఇదీ చదవండి : అన్నదాతకే ఆకలి తీర్చిన చిన్నారి