పండుగ సమయాల్లో రైల్వే స్టేషన్లో రద్దీని తగ్గించే దిశగా దక్షిణ-పశ్చిమ రైల్వే ఫ్లాట్‌ఫామ్ టికెట్ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రూ.10 గా ఉన్న టికెట్ ధర రూ.50 కానుంది. అయితే ఈ నిర్ణయాన్ని కేవలం 13 స్టేషన్లకు మాత్రమే పరిమితం చేశారు రైల్వే అధికారులు.
పెరిగిన ధరలు నవంబర్ 10నుంచి అమల్లోకి రానుండగా... పండుగ సీజన్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ-పశ్చిమ రైల్వే సన్నాహాలు చేస్తోంది.
టికెట్ రేటు పెరిగిన స్టేషన్లు...
కృష్ణరాజపురం, బంగారుపేట, తుంకూర్, హోసూర్, ధర్మపురి, కెంగేరి, మండ్య, హిందూపుర్, పెనుగొండ, యెలహంక, బనస్వాడి, కార్మెలారమ్, వైట్‌ఫీల్డ్
ఇదీ చూడండి: భారతీయ రైల్వే ప్రస్థానాన్ని చాటిచెప్పే మ్యూజియం!